హృతిక్ రోషన్ – సుసానే… వీళ్లిద్దరూ బాల్య మిత్రులు. హృతిక్ హీరోగా సూపర్ సక్సెస్ ను చూసిన తర్వాత, యావత్ దేశం అతడిని కలవరిస్తున్న సమయంలో.. కూడా అతడు సుసానేను మరిచిపోలేదు. ప్రేమగా మారిన స్నేహంతో పెళ్లి చేసుకున్నారు.
చాలా సంవత్సరాలు బాగానే గడిచాయి, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే హృతిక్ కాపురంలో కొన్ని కలతలు మొదలయ్యాయి. వివాహేతర సంబంధాల రచ్చ నడిచింది. అటు సుసానే పేరు ఒక ఎఫైర్ తో, ఇటు హృతిక్ పేరు కంగనతో జతకలిసింది. రచ్చ రచ్చ జరిగింది. చివరకు విడాకులు తీసుకున్నారు.
ఈ విడాకుల డీల్ విలువ నాలుగు వందల కోట్ల రూపాయలు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. భరణం కింద హృతిక్ సుసానేకు నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాడని అంటుంటారు.
మరి ఆ సంగతంతా అలా ఉంటే.. సుసానేలు తరచూ జతగా కనిపిస్తూనే ఉన్నారు. పిల్లలతో హాలిడేను సెలబ్రేట్ చేసుకుంటారు, అంత కలిసి టూర్లు వెళుతూ ఉంటారు. విడాకులు విడాకులే.. పిల్లల కోసం కలవడం కలవడమే.. అన్నట్టుగా సాగుతోంది వీరి వ్యవహారం.
తాజాగా కూడా ఈ జంట మరోసారి జతగా కనిపించింది. పిల్లలతో కలిసి గడిపారు వీళ్లిద్దరూ. ఇదంతా చూస్తుంటే.. భార్యభర్తలుగా ఓడి, తల్లిదండ్రులుగా గెలిచారు హృతిక్-సుసానేలు!