‘గరుడ’ ఎఫెక్ట్.. చుక్కలు చూపిస్తున్న కల్కి

గరుడవేగ సినిమా సక్సెస్ అవ్వడంతో కల్కి మూవీకి ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను హోల్ సేల్ గా తీసుకున్నాడు నిర్మాత కేకే రాధామోహన్. ఓవరాల్ బడ్జెట్…

గరుడవేగ సినిమా సక్సెస్ అవ్వడంతో కల్కి మూవీకి ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను హోల్ సేల్ గా తీసుకున్నాడు నిర్మాత కేకే రాధామోహన్. ఓవరాల్ బడ్జెట్ పై 40శాతం ఎక్కువ చెల్లించి ఈ రైట్స్ తీసుకున్నాడట సదరు నిర్మాత. అలా రిలీజ్ కు ముందే కల్కి నిర్మాతలు లాభాలు వెనకేసుకున్నారు. ఇప్పుడీ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా అంతే దూకుడుగా ఉంది.

రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వడంతో ఒక్కసారిగా మార్కెట్ పెరిగిపోయింది. టీజర్ బాగుండడంతో మొన్నటివరకు 2 కోట్ల రూపాయలకు అటుఇటుగా రేటు చెప్పిన నిర్మాతలు, ఇప్పుడు అమాంతం ధరను 2 రెట్లు పెంచేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ రాజశేఖర్ భార్య జీవిత దగ్గరుండి చూసుకుంటున్నారు.

ప్రస్తుతానికైతే తెలుగులో టాప్-3 ఛానెల్స్ మధ్య కల్కి శాటిలైట్ డీల్ దోబూచులాడుతోంది. ఎవరు దక్కించుకుంటారో చూడాలి. అటు డిజిటల్ రైట్స్ విషయంలో కూడా కల్కి రేటు భారీగానే పలుకుతోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ రంగంలోకి దిగింది. మరోవైపు ఈ మార్కెట్లోకి జీ5 యాప్ తో కొత్తగా అడుగుపెట్టిన జీ గ్రూప్ కూడా కల్కి డిజిటల్ రైట్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది.

మొత్తమ్మీద ఈసారి రాజశేఖర్ సినిమా బిజినెస్, అతడి కెరీర్ లోనే కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమా రాజశేఖర్ కెరీర్ లో భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది. రిలీజ్ లోపు ఇంకెంత వసూలు చేస్తుందో చూడాలి.

జమ్మలమడుగులో ఏం జరిగింది? జగన్ గేమ్ తో టీడీపీకి చెక్?