ఇన్ సైడ్ టాక్: ఆ హీరోయిన్ కు పెళ్లి అక్కర్లేదంట!

ఒకప్పుడు ఆమె చాలా హాట్. స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు చాలామంది సినిమాల్లో నటించింది. వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున.. ఇలా చాలామందిని కవర్ చేసింది. అయితే అందరు హీరోయిన్లలా, క్రేజ్ తగ్గిన…

ఒకప్పుడు ఆమె చాలా హాట్. స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు చాలామంది సినిమాల్లో నటించింది. వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున.. ఇలా చాలామందిని కవర్ చేసింది. అయితే అందరు హీరోయిన్లలా, క్రేజ్ తగ్గిన తర్వాత ఆమె ఇండస్ట్రీని వీడలేదు. పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోలేదు. ఎలాగోలా ఇక్కడే కొనసాగాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం అదే పని చేస్తోంది కూడా.

అయితే ఈ క్రమంలో ఆమె పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. “ఇండస్ట్రీలో ఎలాగోలా కొనసాగాలనుకోవడం మంచిదే. మరి పెళ్లి సంగతేంటి?” అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇస్తోంది. తనకు పెళ్లి అవసరం లేదనేది ఆ మాజీ హీరోయిన్ స్టేట్ మెంట్.

ఓ దర్శకుడితో సహజీవనం చేస్తోందంటూ అప్పట్లో ఆమెపై ఓ రేంజ్ లో పుకార్లు నడిచాయి. అది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అంటుందామె. అలాంటప్పుడు మరో వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ ఇండస్ట్రీ పెద్ద మనిషి ఒకరు సూటిగానే ఆమెను ప్రశ్నించాడు. తనకు పెళ్లితో పని లేదని ఆమె అంతే సూటిగా సమాధానం ఇచ్చి నోరు మూయించింది.

నిజానికి ఆ హీరోయిన్ (మాజీ) గురించి తెలిసిన వాళ్లెవరూ పెళ్లి టాపిక్ ఎత్తరు. ఆమెను ఆ కోణంలో కూడా ఎవ్వరూ చూడరు. కానీ కొంతమంది 'పెద్దోళ్ల'కు మాత్రం ఆ ఛాదస్తం ఉంటుంది కదా. పెళ్లి విషయంలో సరదాగా ఆమెను కెలకడం, ఆనందం పొందడం ఆ 'కొంతమంది'కి బాగా అలవాటు.

బాబు వెరీవెరీ ఇంపార్టెంట్ హామీని ఎలా మ‌రిచార‌బ్బా?

కబుర్లు చెప్పడంలో దిట్ట పవన్ కల్యాణ్..