Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇచ్చట బ్యానర్లు అద్దెకు ఇవ్వబడును!

ఇచ్చట బ్యానర్లు అద్దెకు ఇవ్వబడును!

నితిన్ హీరోగా రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. నిజానికి ఈ సినిమా నితిన్ హీరోగా ఆయన స్వంత బ్యానర్ లో అని వుంటే, జనం అంతగా చెప్పుకునేవారు కాదేమో? కానీ పవన్ కళ్యాణ్ బ్యానర్ లో, త్రివిక్రమ్ కథ, పార్టనర్ షిప్ తో అనేసరికి అప్పుడే రావాల్సిన బజ్ స్టార్ట్ అయిపోయింది. నిజానికి ఈ సినిమాకు పూర్తి నిర్మాణ బాధ్యతలు నితిన్ స్వంత బ్యానర్ వే అని వినికిడి. కథ ఇచ్చినందుకు త్రివిక్రమ్ కు, బ్యానర్ ఇచ్చినందుకు పవన్ కు లాభాల్లో వాటా వుంటుందని టాక్. ఇదెంత వరకు నిజం అన్నది పక్కన పెడితే ఇటీవల టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. 

మన సినిమా మనం తీసుకుంటే బజ్ వుండదు. మనతో సినిమా అవతలివాడు తీస్తే అదే వేరుగా వుంటుంది. అందుకే స్వంత డబ్బులు పెట్టుకుని, అవతలి బ్యానర్లు తీసుకోవడం అన్నది కామన్ అయిపోయింది. కానీ తెరముందు మాత్రం వేరుగా వుంటుంది..తెర వెనుక వేరుగా వుంటుంది. 

ఆ మధ్య నిర్మల కాన్వెంట్ సినిమా వచ్చింది. నిర్మాత ఎవరు? దర్శకుడి తండ్రే అని అంటారు. కానీ బయటకు మాత్రం మాట్రిక్స్ ప్రసాద్, అక్కినేని నాగార్జున లాంటి పెద్ద పేర్లు వినిపిస్తాయి.  గతంలో యువి వాళ్లు, ఓ యంగ్ హీరోతో తీసిన హిట్ సినిమాకు కూడా పెట్టుబడి ఆ హీరోదే అని వినికిడి.

అలాగే కొనేరు హవీష్ త్వరలో యువి బ్యానర్ లో సినిమా చేయబోతున్నారు. మారుతి దర్శకుడు. కానీ డబ్బులు ఎవరివి? హవీష్ వే అని టాక్.

బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా వుంది. ఎవరిది ఎక్కువ పెట్టుబడి..బెల్లంకొండ సురేష్ దే అని వినికిడి. 

ఇవన్నీ కూడా బ్యానర్ వాల్యూ  తోడయితే, సినిమాకు బజ్ వస్తుంది. పైగా స్వంత సినిమా అంటే, 'ఆడికి ఆడే తీసేసుకుంటున్నాడ్రా' అనే తేలిక భావం వచ్చేస్తుంది అన్న అనుమానంతో ఇలా చేస్తున్నారు చాలా మంది. 

మరి కొంతమందికి ఆర్థిక లావాదేవీల సమస్య వుంటుంది. అందుకని వేరే బ్యానర్లపైకి వెళ్తారు. ఆ మధ్య ఓ ధ్విభాషా చిత్రం తీసి, గట్టి దెబ్బ తిన్న నిర్మాత, ఆ తరువాత తన మరో డబ్బింగ్ సినిమాను, వేరే చిన్న బ్యానర్ చేతిలో పెట్టారు. 

ఇంకొంత మంది సినిమా తీసేసిన తరువాత బ్యానర్ వాల్యూ జోడిస్తున్నారు. రాజుగారి గది సినిమాకు వారాహి బ్యానర్, పెళ్లి చూపులు సినిమాకు సురేష్ బ్యానర్ జోడించినట్లు.

సుకుమార్ కుమారి 21 ఎప్ ది ఇంకో టైపు. రత్నవేలు, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ తమ పారితోషికాలే పెట్టుబడిగా పెట్టి, నిర్మాతను మిగిలిన ఖర్చులు పెట్టుకోమని సినిమా తీసారు. ఆపై లాభాల్లో ముందు అనుకున్న ప్రకారం తమ మొత్తాలు తీసేసుకుని, ఆపై మిగిలింది నిర్మాతకు. ఆఫ్ కోర్స్ పాపం, ఆ నిర్మాతకు ఆ సినిమాలో మిగిలింది ఎంత అన్నది డవుటే అని టాక్.

ఇప్పుడు నితిన్ సినిమాకు కూడా త్రివిక్రమ్ కథ, పవన్ బ్యానరే పెట్టుబడి అని, ఖర్చంతా నితిన్ దే అని టాక్ వినిపించడం ప్రారంభమైంది. మరి ఇన్ సైడ్ అగ్రిమెంట్ లో ఏమిటో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?