సినిమా టీజర్ కు వన్ మిలియన్, ట్రయిలర్ కు అయిదు మిలియన్ వ్యూస్ అంటూ లెక్కలు కట్టడం ఇటీవల మామూలయిపోయింది. పైగా ఇలా నిర్మాతకు పనికిరాని, కేవలం హీరోలు, వారి అభిమానులు చెప్పుకోవడానికి మాత్రం పనికివచ్చే రికార్డులపై ఇటీవల పిచ్చి పట్టుకుంది. పైగా దీని కోసం తెరవెనుక లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఆ తరువాత మాకు ఇన్ని వ్యూస్ వచ్చాయోచ్ అని డప్పేసుకుంటున్నారు.
కానీ ఏ ఖర్చు పెట్టకుండా, సినిమా విడుదలయిపోయి యాభై రోజులు అయిన తరువాత, ఆ సినిమాలోని ఓ పాట విడుదయితే 24గంట్లలో దగ్గర దగ్గర వన్ మిలియన్ వ్యూస్ రావడం అంటే ఏమనుకోవాలి? అదీ నికార్సయిన అభిమానం అనుకోవాలి. ఆ పాట పట్ల జనం అంత ఫిదా అయిపోయారు అనుకోవాలి.
ఫిదా సినిమాలో సాయి పల్లవి అంటే ఇప్పుడు జనాలకు పిచ్చి అభిమానం. ఆ సినిమాలో ఆమె నటించిన, నర్తించిన 'హేయ్ పిలగాడ' విడియో సాంగ్ ను నెట్ లో విడుదల చేసారు. ఇరవై నాలుగు గంటలు గడవకుండా వన్ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి.
అదే విధంగా అదే సినిమాలోని 'మెల్ల మెల్లగ వచ్చిండే' పాట విడుదల చేస్తే జస్ట్ గంటల్లోనే 8లక్షల వ్యూస్ వచ్చేసాయి. 16కోట్లతో నిర్మించిన ఫిదా సినిమాకు ఒక్క నైజాంలోనే 20కోట్ల కలెక్షన్లు వచ్చాయి. వరల్ట్ వైడ్ గా టోటల్ రన్ లో యాభై కోట్లు వసూలు చేసింది.