Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇదిగో మహేష్-అదిగో శిక్షణ

ఇదిగో మహేష్-అదిగో శిక్షణ

సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ సినిమా సరిలేరు నీకెవ్వరు. మాస్ ఎంటర్ టైనర్ అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమా మీద సడెన్ గా ఓ గ్యాసిప్ గుప్పుమంది. మహేష్ బాబు సినిమాకోసం విదేశీ టీమ్ ను యాక్షన్ సీన్ల కోసం తీసుకువస్తున్నారని, వాళ్లతో మహేష్ కు ట్రయినింగ్ వుంటుందన్నది ఆ గ్యాసిప్ సారాశం.

కానీ డైరక్టర్ అనిల్ రావిపూడి ఈ గ్యాసిప్ చూసి నవ్వుకున్నట్లు బోగట్టా. ఇదంతా ఫేక్ అని, తన సినిమాకు ఏ విదేశీ నిపుణులు పనిచేయడం లేదని, రామ్ లక్ష్మణ్ మాస్టర్ నే పని చేస్తారని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చినట్లు బోగట్టా. అంతేకాదు, మహేష్ కు ఏ ట్రయినింగ్ వుండదని, కాశ్మీర్ వెళ్లాక అక్కడ ఆర్మీ టీమ్ ను సమీకరించాక, వారికి మాత్రం ఓ ఎపిసోడ్ కోసం శిక్షణ ఇస్తామని అది కూడా జస్ట్ టూ టు ఫోన్ డేస్ అని అన్నట్లు తెలుస్తోంది.

కాశ్మీర్ లో ఓ రెస్క్యూ ఆపరేషన్ సీన్, హీరో క్యారెక్టరైజేషన్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాంటివి చిత్రీకరిస్తారని తెలుస్తోంది. కాశ్మీర్, సోనామార్గ్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో రెండు వారాలకు పైగా షూట్ చేసాక, హైదరాబాద్ వచ్చి, ఇక్కడ 20 రోజుల షెడ్యూలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మించే ఈ సినిమాను సంక్రాంతి విడుదలగా రెడీ చేస్తున్నారు.

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?