వార్తలు లేకపోతే పుట్టించడమే లేటెస్ట్ ట్రెండ్ గా మారిపోతోంది. హీరో శర్వానంద్ రైటర్ కమ్ డైరక్టర్ కృష్ణ చైతన్యతో పవర్ పేట సినిమా చేస్తున్నాడనే వార్త ఇలాగే పుట్టుకు వచ్చేసింది.
గమ్మత్తేమిటంటే దర్శకుడు కృష్ణ చైతన్య ఇటీవలి కాలంలో శర్వానంద్ ను కలిసింది లేదు, సినిమా గురించి డిస్కస్ చేసిందీ లేదు. పవర్ పేట సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో వుంటూ వస్తోంది.
వాస్తవానికి ఈ సినిమాను వరుణ్ తేజ్ తో చేయాల్సి వుంది. కానీ నితిన్ తో ఒప్పదం ప్రకారం అటు వెళ్లాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం హిట్ కోసం చూస్తున్న నితిన్ పవర్ పేట సినిమాను చేసే ఐఢియాను పక్కన పెట్టారు.
కానీ ప్రస్తుతం పవర్ పేటనా? మరొకటినా? ఏ హీరో అవకాశం ఇస్తే, అతనికి నచ్చే ప్రాజెక్టు ఏది చేద్దామా? అని మీమాంసలో వున్నారు కృష్ణ చైతన్య. కానీ ఈలోగా ఈ గ్యాసిప్ వచ్చేసింది. అదేమిటో? పాపం?