Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇక్కడా పూరి అదే టైపు

ఇక్కడా పూరి అదే టైపు

ఆటో జానీ..ఆటో జానీ ఎందుకు ఆగిపోయావు అంటే పూరి పూర్తి కథ చెప్పలేదుగా అందట. అలాగ్గే వుంది ఎన్టీఆర్-పూరి సినిమా కూడా.  కళ్యాణ్ రామ్ తో చేస్తున్న ఇజమ్ పూర్తయిపోతే, పూరి చేతిలో పెద్ద సినిమా ఏదీ లేదు. ఏ హీరో కూడా రెడీగానూ లేరు. మహేష్ బాబు మాట నిలబెట్టుకోవాలన్నా కూడా కనీసం ఏణ్ణర్థం పట్టే పరిస్థితి. మరి ఇంకెవరు? ఎన్టీఆర్ నే మిగిలారు. 

టెంపర్ తో బ్రేక్ ఇచ్చాడు కాబట్టి, మళ్లీ ఓకె అనే అవకాశం వుంది. అందుకే ఓ కథ చెప్పాడట పూరి. కానీ పూర్తిగా కాదు. తొలి సగమే. మలిసగం ఇజమ్ తరువాత చెబుతాడో? లేదా అలాగే సెట్ మీదకు వెళ్లి మలి సగం అక్కడ చెక్కుతాను అంటారో? కానీ ఎన్టీఆర్ మాత్రం దాన్ని పట్టించుకోకుండా, తన మానాన తను కథలు వినుకుంటూపోతున్నారట. 

కథలు ఎవరు చెబుతున్నారు? అన్నది తెలియడం లేదు కానీ, వింటున్నది పక్కా. ఈ నేపథ్యంలో సరైన కొత్త దర్శకులకు ఎన్టీఆర్ అవకాశం ఇచ్చే ఐడియా కూడా వుందని వినిపిస్తోంది. అన్నట్లు  అనిల్ రావిపూడి కూడా ఎన్టీఆర్ కు లైన్ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?