ఇలా చాలా మందే చెప్పారు కోనా..?

ఆడియన్స్ నే ముఖ్యం..క్రిటిక్స్ కాదు..ఎన్టీఆర్ ప్రేక్షకులే దేవుళ్లు అన్నారు కానీ, క్రిటిక్స్ దేవుళ్లు అనలేదు.. ఇలాంటి మాటల తూటాలు విసిరారు కోన వెంకట్.  Advertisement ఎన్ని సినిమాలు అదే రొటీన్ పాయింట్లతో రుబ్బేసినా జనం…

ఆడియన్స్ నే ముఖ్యం..క్రిటిక్స్ కాదు..ఎన్టీఆర్ ప్రేక్షకులే దేవుళ్లు అన్నారు కానీ, క్రిటిక్స్ దేవుళ్లు అనలేదు.. ఇలాంటి మాటల తూటాలు విసిరారు కోన వెంకట్. 

ఎన్ని సినిమాలు అదే రొటీన్ పాయింట్లతో రుబ్బేసినా జనం చూస్తున్నారు అన్నది ఆయన ధీమా. ఆ ధీమానే ఈ మాటలు మాట్లాడించి వుండొచ్చు.  పండగ చేస్కో..సూపర్ డూపర్ హిట్ అయిపోయిందని ఆయన అనుకుంటూ వుండి వుండొచ్చు..కానీ అంతటి రచయితకు ఓ సంగతి తెలుసే అనుకోవాలి. మ్యాజిక్ లు ఎల్లకాలమూ సాగవు. ఇప్పటికే ఇదే ఫార్ములాలో, ఇదే రుబ్బుడులో వచ్చిన సినిమాల్లో బకెట్ తన్నేసిన వాటి శాతం ఎన్నన్నది కూడా లెక్కించుకోవాలి. 

ఒకటి వాస్తవం క్రిటిక్స్ ఒపీనియన్, ప్రేక్షకుల టేస్ట్ కొన్ని సార్లు మ్యాచ్ కావచ్చు..కొన్ని సార్లు కాకపోవచ్చు. ఈ రోజుల్లో, బస్ స్టాప్, ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ ఇలాంటి వాటిని క్రిటిక్స్ ఎలా మెచ్చుకుంటారు. కానీ జనం చూసారు. అంటే జనానికి అవే కావాలి అనుకుని చాలా మంది అలాంటి సినిమాలే తీస్తూ పోయారు..ఒక్కదానికైనా డబ్బులు వచ్చాయా? ఎందుకు తీయడం ఆపేసారు? 

ఇలా ఫ్లాపయిన, ఏవరేజ్ అయిన సినిమాల జనాలు క్రిటిక్స్ మీద విరుచుకుపడడం మామూలే. 

ఒక్క విషయం గమనిస్తే చాలు కోన వెంకట్ చెబుతున్నట్లు పండగ చేస్కో ఏ మేరకు హిట్ అన్నది అర్థం అవుతుంది. టాలీవుడ్ ఆనవాయతీ ప్రకారం విడుదలయి మూడు రోజులు కాకుండానే సక్సెస్ మీట్ పెట్టారంటే సినిమా ను ఎత్తాల్సిన అవసరం వచ్చిందని అర్థం. ఈ ముక్క టాలీవుడ్ లో వున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికైనా చౌకబారు డైలాగులు, రుబ్బుడు స్క్రిప్ట్ లు మాని, మంచి కథనాలపై దృష్టి పెడితే, క్రిటిక్స్ ను తిట్టుకోవాల్సిన పరిస్థితి వుండదు.