ఇల్లీ బేబ్‌ సహజీవనం చేస్తోందా.?

బెల్లీ బ్యూటీ.. ఇల్లీ బేబ్‌.. ఇలా ఇలియానా గురించి ఎన్నయినా చెప్పుకోవచ్చు. తెలుగు తెరపైకి సంచలనంలా దూసుకొచ్చిందీ భామ 'దేవదాసు' సినిమాతో. 'పోకిరి' ఇలియానా ఫేట్‌ని మార్చేసింది. భారీ సక్సెస్‌లు, అంతకన్నా పెద్ద డిజాస్టర్లు…

బెల్లీ బ్యూటీ.. ఇల్లీ బేబ్‌.. ఇలా ఇలియానా గురించి ఎన్నయినా చెప్పుకోవచ్చు. తెలుగు తెరపైకి సంచలనంలా దూసుకొచ్చిందీ భామ 'దేవదాసు' సినిమాతో. 'పోకిరి' ఇలియానా ఫేట్‌ని మార్చేసింది. భారీ సక్సెస్‌లు, అంతకన్నా పెద్ద డిజాస్టర్లు ఇలియానా కెరీర్‌లో వున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమై, బాలీవుడ్‌ సినిమాలతో సరిపెడుతున్న ఇలియానా, తన బాయ్‌ఫ్రెండ్‌తో కొంతకాలంగా 'డేటింగ్‌'లో బిజీ బిజీగా వుంది. 

మొదట్లో బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోస్‌ గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే, 'జస్ట్‌ అతను స్నేహితుడు మాత్రమే.. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు..' అని చెప్పేది ఇలియానా. తర్వాత్తర్వాత, 'డేటింగ్‌ చేస్తే తప్పేంటి..' అని అమాయకంగా ప్రశ్నించేది. ఇప్పుడు మాత్రం, అతను తనకు లవర్‌.. అని బాహాటంగానే చెబుతోంది. అంతేనా, తనను పూర్తిగా అర్థం చేసుకున్న ఆండ్రూ, తన జీవిత భాగస్వామి అయ్యేందుకు అన్ని అర్హతలూ కలిగి వున్నవాడంటోంది. 

తాజాగా ఇలియానా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'పొద్దున్నే ఎలాంటి మేకప్‌ లేకుండా చెదిరిన జుట్టుతో కనిపిస్తే ఆండ్రూకి ఎంతో ఇష్టం..' అని చెప్పడంతో ఒక్కసారిగా బాలీవుడ్‌ సినీ జనం షాకయ్యారు. అంటే, ఇలియానా ఆండ్రూతో సహజీవనం చేస్తున్నట్లే కదా.? అంటూ బాలీవుడ్‌లో గాసిప్స్‌ షురూ అయ్యాయి. ఈ విషయాన్ని ఇలియానా వద్ద ప్రస్తావిస్తే 'నో కామెంట్‌' అనేస్తోంది. పెళ్ళి గురించిన ఆలోచన ప్రస్తుతానికి లేదంటూ ఇలియూనా తప్పించేసుకుంది. ఇంతకీ ఇలియానా, తన బాయ్‌ఫ్రెండ్‌తో స్నేహాన్ని ప్రేమదాకా తీసుకొచ్చింది సరే.. పెళ్ళి పీటలెక్కిస్తుందా.? ఏమో మరి, ఆమెకే తెలియాలి.