ఇంద్రగంటి సినిమాలో సుధీర్ బాబు?

అమీతుమీ అనే చిన్న సినిమా చేసి శభాష్ అనిపించుకున్నారు దర్శకుడు ఇంద్రగంటి. పెద్ద హీరోలు ఎవరూ సెట్ కావడం లేదు. అందుకే మళ్లీ మరో చిన్న సినిమాను తలకెత్తుకునే ఆలోచనలో వున్నారు. యూరోస్ సంస్థ…

అమీతుమీ అనే చిన్న సినిమా చేసి శభాష్ అనిపించుకున్నారు దర్శకుడు ఇంద్రగంటి. పెద్ద హీరోలు ఎవరూ సెట్ కావడం లేదు. అందుకే మళ్లీ మరో చిన్న సినిమాను తలకెత్తుకునే ఆలోచనలో వున్నారు. యూరోస్ సంస్థ ఈ మేరకు ఇంద్రగంటితో ఓ ఒప్పదం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫినిష్ చేస్తే, ఆ తరువాత పెద్ద హీరోలు ఎవరన్నా ఖాళీ అయి, డేట్లు ఇచ్చే అవకాశం వుందని ఆలోచిస్తున్నారు.

అయితే ఇప్పడు ఈ చిన్న సినిమాకు ఎవరు హీరో? ఇక్కడా సమస్యే. ఆఖరికి సుధీర్ బాబుతో చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రమ్ తరువాత సుధీర్ బాబు అడపా దడపా సినిమాలు చేస్తున్నా, సరైన హిట్ కొట్టలేదు. బాలీవుడ్ కు వెళ్లినా మరీ అద్భుతాలేమీ జరగలేదు.

ఇంద్రగంటి ఇప్పటి వరకు అన్నీ మంచి సినిమాలే ఇచ్చారు. ఒక్క అల్లరి నరేష్ తోనే తేడా కొట్టింది. ఆయన స్టయిల్ క్లాసిక్ కామెడీ లైన్ లు అలాంటివి. మరి ఇప్పుడు సుధీర్ కు కూడా హిట్ ఇస్తారేమో చూడాలి.