ఇంకొక హిట్‌ రాసుకోవచ్చా?

నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సెప్టెంబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. గుండెజారి గల్లంతయ్యిందే దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రెయిలర్‌ కొద్ది…

నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సెప్టెంబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. గుండెజారి గల్లంతయ్యిందే దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రెయిలర్‌ కొద్ది సేపటి క్రితం యూట్యూబ్‌లో రిలీజ్‌ అయింది. 

మంచి రొమాంటిక్‌ కామెడీ అనే నమ్మకం కలిగిస్తోన్న ఈ ట్రెయిలర్‌ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. చైతన్య ఇంతవరకు చేసిన లవ్‌స్టోరీస్‌ అన్నీ హిట్టే. ఆ లెక్కన ఇది కూడా అతనికి కలిసి వస్తుందనే అనిపిస్తోంది. విజయ్‌కుమార్‌ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రాన్ని ఎంత వినోదాత్మకంగా తీర్చి దిద్దాడనేది తెలిసిందే. ఈ సినిమాలోను ఆ కళలు కనిపిస్తున్నాయి. 

లవ్‌స్టోరీలు బాగా తగ్గిపోయిన టైమ్‌లో చైతన్యకి మాత్రం వరుసగా మంచి ప్రేమకథలు దొరుకుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి ఉన్న రొమాంటిక్‌ హీరోస్‌ ట్యాగ్‌ని చైతన్య సక్సెస్‌ఫుల్‌గా క్యారీ చేసేస్తున్నాడు. ఒక లైలా కోసం కూడా హిట్టయిపోతే ఈ తరంలో బెస్ట్‌ లవర్‌బాయ్‌గా చై టాప్‌ ఛెయిర్‌ దక్కించుకుంటాడు.