ఇంట కన్నా బయటే బెటర్ పవన్

గడచిన రెండు మూడేళ్లుగా కోడిపందేలు మన సంప్రదాయం అంటూ వెస్ట్ గోదావరి జిల్లాలో గగ్గోలు వినిపిస్తోంది. కానీ పవన్ మాట్లాడిన పాపన పోలేదు. కానీ ఈ సంక్రాంతికి కోడి పుంజును చంకన పెట్టుకుని ఓ…

గడచిన రెండు మూడేళ్లుగా కోడిపందేలు మన సంప్రదాయం అంటూ వెస్ట్ గోదావరి జిల్లాలో గగ్గోలు వినిపిస్తోంది. కానీ పవన్ మాట్లాడిన పాపన పోలేదు. కానీ ఈ సంక్రాంతికి కోడి పుంజును చంకన పెట్టుకుని ఓ స్టిల్ వదిలి, పరోక్షంగా తాను కూడా కోడిపందాలకు సై అనేసాడు. 

కానీ వివాదాస్పద జల్లికట్టు విషయానికి వచ్చేసరికి మాత్రం క్లారిటీగా ట్వీట్ లు చేసేసాడు. ఇదే అదను అని కేంధ్రలో వున్న భాజపాను మరోసారి టార్గెట్ చేసే పనిలో పడ్డాడు. పైగా జల్లికట్టును నిషేధించడం ద్రవిడ సంస్కృతిపై దాడిగా అభివర్ణించాడు. ఇండియా నుంచి హిందూ వ్యక్తుల సంస్థలే అధికంగా బీఫ్ ను ఎగుమతి చేస్తుండగా, జంతుహింస గురించి భాజపా మాట్లాడడంలో అర్థం లేదని విమర్శించాడు. 

మొత్తం మీద ఇంటి అంశాలు వేటిమీదైనా కర్ర విరక్కుండా, చావకుండా మాట్లాడే, పవన్ పక్కింటి అంశం మీద అయినా క్లారిటీగా మాట్లాడడం మెచ్చుకోదగ్గదే.