ఇజమ్ ను ఆదుకుంటున్న ఎన్టీఆర్ బయ్యర్లు

ఎన్టీఆర్ కు తనకంటూ కొంతమంది బయ్యర్లు వున్నారు. ఆయన సినిమాలను వీళ్లు కొనడానికి లేదా పంపిణీ చేయడానికి ఎన్టీఆర్ తన వంతు మాట సాయం చేస్తుంటారు కూడా. నిర్మాతల బయ్యర్లు ఎవరు వున్నా కూడా,…

ఎన్టీఆర్ కు తనకంటూ కొంతమంది బయ్యర్లు వున్నారు. ఆయన సినిమాలను వీళ్లు కొనడానికి లేదా పంపిణీ చేయడానికి ఎన్టీఆర్ తన వంతు మాట సాయం చేస్తుంటారు కూడా. నిర్మాతల బయ్యర్లు ఎవరు వున్నా కూడా, ఎన్టీఆర్ కలుగచేసుకుని వీరికి ఇప్పించడం కూడా మామూలే. ఇప్పుడు ఆ బయ్యర్లే కళ్యాణ్ రామ్-పూరి ఇజమ్ సినిమాను ఆదుకోబోతున్నట్లు తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ బయర్లకే ఇజమ్ బాధ్యతలు కూడా అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇజమ్ సినిమాకు ఏకంగా 26 కోట్లు ఖర్చయింది. ఆ రేంజ్ లో అమ్మకాలు సాగించాలంటే సాధ్యం అయ్యే పని కాదు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ మార్కెట్, పూరి ఇటీవలి ట్రాక్ రికార్డ్ చూస్తారు ఎవరైనా. అందుకే అడ్వాన్స్ లు తీసుకుని, కమిషన్ పై డిస్ట్రిబ్యూషన్ చేసే బాధ్యతను తన బయ్యర్లు ఎన్టీఆర్ అప్పచెబుతున్నట్లు తెలుస్తోంది. సో, నైజాం మళ్లీ దిల్ రాజే చేపడతారు. 

మిగిలిన ఏరియాలు కూడా అలాగే చాలా వరకు గ్యారేజ్ డిస్ట్రిబ్యూటర్లే చేస్తారు. ఎలాగూ ఎన్టీఆర్ కు మళ్లీ ఊపు వచ్చింది. పైగా తరువాతి సినిమా ఇజమ్ చేసిన బ్యానర్ లోనే. అందువల్ల ఆ మాత్రం మొహమాటం, ముందు చూపు తప్పవు.