సునీల్ తో చెట్టపట్టాలు వేసుకుని, సినిమాలకు కూడా దూరమైపోయిందని అనేక వదంతులకు తావిచ్చిన ఇషాచావ్లా మరోసారి పబ్లిక్ లో తళుక్కుమంది. నరేష్ జంప్ జిలానీ అడియో వేడుకకు హాజరైంది.
కానీ చూసినవారంతా ఇషా ముఖంలో ముదరుకళ కొట్టొచ్చినట్లు కనిపించిందని ఫంక్షన్ కు హాజరైనవారు గుసగుసలాడారు. పేరుకు రెండు మూడు సినిమాలు చేతిలోవున్నాయన్న మాటే కానీ, రెడీ అవుతున్నది ఒక్క జంప్ జిలానీ ఒక్కటే. అది ఏమన్నా ఈ అమ్మడికి పనికివస్తుందా అంటే అదీ అనుమానమే.
ఎందుకంటే, అల్లరి నరేష్ సినిమాలు హిట్ కొట్టినా,హీరోయిన్లు చాన్సులు పెద్దగా కొట్టిన దాఖలాలు లేవు. పైగా ఇప్పుడు ఇలాంటి ముదురు లుక్స్ వుంటే, తెలుగులో ఆమెకు సూటయ్యే హీరోలు ఎవరూ లేనట్లే. చిన్న హీరోలపక్కన సూటవుదు. మాస్ పాపులర్ హీరోలు ఆమె వంక చూడరు. కెరియర్ కష్టంగానే వుండేలా వుంది.