ఇవేం పోజులు హన్సిక..?

ఫొటోలు లీక్ అయిపోయాయి. అవి నెట్ లో వైరల్ అయిపోతున్నాయి అని గగ్గోలు పెట్టడం సంగతి అలా వుంచుదాం. అసలు ఇలా ఫోటోలకు పోజులు ఇవ్వడం ఏమిటి? ఇదంతా హీరోయిన్ హన్సిక ఫొటోల సంగతే.…

ఫొటోలు లీక్ అయిపోయాయి. అవి నెట్ లో వైరల్ అయిపోతున్నాయి అని గగ్గోలు పెట్టడం సంగతి అలా వుంచుదాం. అసలు ఇలా ఫోటోలకు పోజులు ఇవ్వడం ఏమిటి? ఇదంతా హీరోయిన్ హన్సిక ఫొటోల సంగతే. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హన్సిక ఫొటోలు కొన్ని తెగ తిరుగుతున్నాయి.

ఓ బోట్ లో హన్సిక ఇన్నర్ వేర్ తో మాత్రం వున్న ఫొటోలు అవి. ఆ ఫొటోల్లో హన్సిక తన ఫోన్ తో తను బిజీగా వున్నట్లు కనిపిస్తోంది. అంటే అలాంటి టైమ్ లో వేరేవాళ్లు తీసారన్నమాట. పైగా అక్కడ బోట్ క్రూ కూడా వున్నారు. మరి ఇంత మంది మధ్య వుంటూ, మరీ ఇలా ఇన్నర్ వేర్ తో సిగ్గు, బిడియం రెండూ వదిలేసి తిరిగేయడం అంటే ఏమనుకోవాలి?

వ్యక్తిగతం, స్వేచ్చ, మన్ను మశానం ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. కానీ చూసినవాళ్లు మాత్రం అంత మంది ముందు అలా ఇన్నర్ వేర్ తో పోజలు ఇస్తే బరితెగింపు అనే అంటారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ కావడంతో లీక్ అయ్యాయి.. లేదా లీక్ చేసారు.. కాదు… ఫోన్ నే హ్యాక్ చేసారు ఇలా ఎన్నయినా చెప్పవచ్చు.

అవును ఈ సంగతి అలావుంచితే ఇన్నర్ వేర్ మినహా మిగిలిన ఎక్స్ ఫోజ్ అయిన హన్సిక బాడీని చూస్తుంటే, అస్సలు ఫిజికల్ ఎక్సర్ సైజ్ లేనట్ల, వయసు మీద పడుతున్న ఛాయలు కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇంక ఎన్నాళ్లు వుండడం కష్టమే ఏమో, ఫీల్డ్ లో.

తలసానిని కలిస్తే సస్పెండా? మరి పరిటాల పెళ్ళిలో సెల్ఫీలు దిగారే

ఇండియన్ యూత్.. సెక్స్ కన్నా స్మార్ట్ ఫోనే ఇష్టం!