జాదూగాడు మారతాడా?

మాస్ పాత్రలు పోషించడం అంటే ఏ నటుడికైనా ఇష్టమే. అయితే అందరికీ అవే కావాలి అంటే ఎలా? నిజానికి లవర్ బాయ్ కేటగిరిలో ఇప్పుడు టాలీవుడ్ లో పెద్దగా కాంపిటీషన్ లేదు. కానీ ఆ…

మాస్ పాత్రలు పోషించడం అంటే ఏ నటుడికైనా ఇష్టమే. అయితే అందరికీ అవే కావాలి అంటే ఎలా? నిజానికి లవర్ బాయ్ కేటగిరిలో ఇప్పుడు టాలీవుడ్ లో పెద్దగా కాంపిటీషన్ లేదు. కానీ ఆ ఇమేజ్ వున్న నాగశౌర్య మాస్ ఇమేజ్ కోసం చూస్తున్నాడు. ఇంతకు ముందు సునీల్ కూడా ఇలాగే చేసాడు. సునీల్ హీరో అయ్యాక, అందరూ కామెడీ లైన్ కథలు చెబితే, వద్దు, మాస్ కథలు పట్రాండి అన్నాడు.దాంతో కెరీర్ ఒడిదుడుకుల్లో పడింది. 

ఇప్పుడు నాగశౌర్య తొలిసారి జాదూగాడుతో మాస్ క్యారెక్టర్ ట్రయ్ చేసాడు. కానీ డైరక్టర్ యోగి అటు తిప్పి, ఇటు తప్పి, ఆ క్యారెక్టర్ ను ఎటూ కాకుండాచేసాడు. ఇప్పుడు నాగశౌర్య చేతిలో రెండు సినిమాలు వున్నాయి. అవి రెండూ కాస్త ఫ్యామిలీ సబ్జెక్ట్ లే అని వినికిడి.  తన దగ్గరకు వచ్చేవారిని మాస్ సబ్జెక్ట్ ల అడుగుతున్నాడని ఇండస్ట్రీ టాక్.

ఇటీవల ఓ దర్శకుడు తన రెండో సినిమా కోసం నాగశౌర్యను సంప్రదిస్తే, మాస్ సబ్జెక్ట్ నే కావాలన్నాడట. దాంతో ఆ యూనిట్ రాహుల్ రవీంద్రన్ ను తీసుకున్నట్లు వినికిడి. నాగశౌర్య తన ఫేస్ లో కాస్త లుక్ చేంజ్ అయ్యేవరకన్నా, ఈ లవర్ బాయ్ ఇమేజ్ పాత్రలకు ఓకె చెప్పడం మంచిదని ఇండస్ట్రీ టాక్.