జగన్ కోపం..థియేటర్ల శాపం

ఆంధ్ర సిఎమ్ జగన్ ఎదుట మామూలుగానే మంత్రులు పెద్దగా మాట్లాడలేరు. అలాంటిది ఇక ఆయన ఆగ్రహంతో వుంటే మాట్లాడగలరా? నిన్నటికి నిన్న కేబినెట్ మీట్ లో అదే జరిగిందని బోగట్టా.  Advertisement సినిమా జనాలు…

ఆంధ్ర సిఎమ్ జగన్ ఎదుట మామూలుగానే మంత్రులు పెద్దగా మాట్లాడలేరు. అలాంటిది ఇక ఆయన ఆగ్రహంతో వుంటే మాట్లాడగలరా? నిన్నటికి నిన్న కేబినెట్ మీట్ లో అదే జరిగిందని బోగట్టా. 

సినిమా జనాలు అంతా ఎవరికి వున్న పరిచయాలు వారు ఉపయోగించి మంత్రులంతా కేబినెట్ మీట్ లో సినిమా టికెట్ ల రేట్ల పెంపు వ్యవహారాన్ని జగన్ దృష్టికి తెచ్చేలా వ్యూహం రచించారు. ఒక మంత్రి కాకుంటే మరో మంత్రి అయినా ధైర్యం చేస్తారని అనుకున్నారు. 

కానీ ఏం జరిగింది. ఎందుకో తెలియదు కానీ జగన్ కాస్త చికాగ్గా, ఆగ్రహంతో వున్నారని మంత్రులు గమనించారని బోగట్టా. దాంతో ఎవ్వరూ పెదవి విప్పకుండా ఆయన చెప్పింది విని, టేబుల్ అజెండాను ఫాలో అయిపోయి, మీట్ నుంచి బయటకు వచ్చారు. దాంతో గత వారం రోజులుగా సినిమా ఇండస్ట్రీ ఈ కేబినెట్ మీట్ మీద పెట్టుకున్న ఆశలు నీరుకారిపోయాయి.

ఇక మళ్లీ ఈ విషయం సిఎమ్ జగన్ దృష్టికి ఎలా వెళ్తుందో? ఆయన ఎలా స్పందిస్తారో తెలియదు. ఇప్పటికైతే ఈ వ్యవహారానికి కామా పడిపోయింది. 'జగన్ కాస్త కోపంగా వున్నారు. ఈ టైమ్ లో సినిమా టికెట్ ల వ్యవహారం కదపడం సరైనది కాదు. నో అనేసారు అంటే ఇక తలుపులు పూర్తిగా మూసుకుపోతాయి. అందుకే కదపలేదు' అని ఓ మంత్రి సినిమా జనాలకు సమాచారం అందించనట్లు తెలుస్తోంది. 

ఇక ఇండస్ట్రీ జనాలకు మిగిలిన ఆశ ఏమిటంటే ఈ నెల 15 తరువాత అయినా నైట్ కర్ఫ్యూ ఎత్తేసి, తెలంగాణలో మాదిరిగా నూరుశాతం ఆక్యుపెన్సీ ఇస్తారేమో అన్నదే. అలా అయితే కనీసం చిన్న, మీడియం సినిమాలు విడుదలకు రెడీ అయిపోతాయి. పెద్ద సినిమాల సంగతి అక్టోబర్ నాటికి చూడొచ్చు.