జాగ్వార్ విడుదలకు ముందు ఎక్కడ చూసినా ఆ సినిమా ముచ్చట్లే. ఆ సినిమా నిర్మాత, ఆ సినిమా హీరో నిఖిల్ తండ్రి కన్నడ రాజకీయ ప్రముఖుడు కుమారస్వామి, టాలీవుడ్ చుట్టూనే తిరిగారు. ఇక్కడే కొన్ని రోజులు తరచు గడిపారు కూడా. తెలుగు మీడియాకు, తెలుగు సినిమా రంగానికి ఆయన సదా కృతజ్ఞతలు తెలిపారు.
జాగ్వార్ తెలుగు వెర్షన్ బాధ్యతలు అన్నీ, సినిమా నిర్మాత వైజాగ్ రాజు చూసుకున్నారు. ఆయనతో గత అనుభవవాలు వున్న రీత్యా, జర జాగ్రత్త అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. కట్ చేస్తే, జాగ్వార్ విడుదలయింది. తెలుగులో సినిమా ఓ మాదిరిగా కలెక్ట్ చేసింది. కానీ ఆ తరువాత మరి వైజాగ్ రాజు కానీ, కుమారస్వామి కానీ టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక్కడి మీడియా బిల్లులు మూడు వంతులు అలాగే పెండింగ్ లో వుండిపోయాయని వినికిడి.
బిల్లులు రావాల్సిన వారంతా వైజాగ్ రాజు నో, కుమారస్వామినో వస్తారని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తారని చూస్తున్నారు. బహుశా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా చేసిన సమయంలో వస్తారేమో? లేదా స్టేట్ బ్యాంక్ రద్దు చేసినట్లు తెలుగు మీడియా కూడా ఈ బిల్లులు రద్దు చేయాలేమో?