Advertisement


Home > Movies - Movie Gossip
జై లవకుశ-స్పైడర్.. ప్లస్లు.. మైనస్ లూ

మరో సంక్రాంతి సీజన్ అనే రేంజ్ లో రెడీ అవుతోంది.  జై  లవకుశ, స్పైడర్ సినిమాలు బలంగా ఢీ కొనడానికి సిద్దమయ్యాయి.  త్రిపాత్రాభినయంతో ఎన్టీఆర్, మురుగదాస్ లాంటి డైరక్టర్ తెచ్చిన స్పై, ఇంటిలిజెన్స్ సబ్జెక్ట్ తో మహేష్ అభిమానులను అలరించడానికి తమ ప్రయత్నం తాము చేసారు.

జై లవకుశ కు ఎన్టీఆర్ నే బలం. బలగం. అందులోనూ మూడు పాత్రలు.

పైగా జై లవకుశ అన్న టైటిల్ కచ్చితంగా ఫ్యామిలీలను ఆకట్టుకుంటుంది.

ఏ తల్లికయినా ముగ్గురు పిల్లలు పుడితే... అన్న ట్రయిలర్ డైలాగు కచ్చితగంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను లాగుతుంది.

సినిమాలో ఫన్ ఎలిమెంట్లు కూడా బాగానే వున్నాయి. అందువల్ల కాస్త మినిమమ్ మైలేజీ వుండే అవకాశం వుంది.

పాటలు కొత్తగా లేకపోవచ్చు, కానీ రాను రాను జనంలోకి వెళ్లే అవకాశం వుంది.

ఇక మైనస్ ల విషయానికి వస్తే, జై లవకుశ కు డైరక్టర్ మైనస్. గత వైఫల్యం అన్నది వెన్నాడుతోంది. ఈ సినిమా హిట్ అయితే అది పక్కకుపోతుంది.

సినిమాకు హీరోయిన్లు అంత ప్లస్సూ కాదు, మైనస్సూ కాదు.

సినిమాలో ముగ్గురు ఎన్టీఆర్ లు వుండడం అన్నది కూడా కాస్త ఇబ్బందే. సినిమా మొత్తం వాళ్లనే చూడాలి. పైగా ద్వితీయార్థంలో ముగ్గురి మధ్య ఎమోషన్లు కీలకంగా వుంటే వినోదం పక్కకు వెళ్లే ప్రమాదం వుంటుంది.

ఇక స్పైడర్ విషయానికి వస్తే..

స్పైడర్ కు మహేష్ బాబుతో పాటు డైరక్టర్ మురుగదాస్ కూడా పెద్ద ప్లస్ పాయింట్.

డిఫరెంట్ సినిమాలు, డిఫరెంట్ ప్రెజెంటేషన్ వుంటుంది అన్న నమ్మకం వుంది మురుగదాస్ మీద.

అలాగే మహేష్ బాబుకు మాస్, క్లాస్, ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ అపరిమితంగా వుంది.

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో విన్నింగ్ హార్స్ గా వుండడం ఓ అడ్వాంటేజ్.

సినిమాలో భారీ సీన్లు వుండడం, గ్రాఫిక్స్ క్వాలిటీగా చేయించడం అన్నది కూడా ప్లస్సయ్యే అవకాశం వుంది.

రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలా కాకుండా కాస్త హెవీగా, హాలీవుడ్ సినిమా టచ్ లో వుండడం, అదే సమయంలో మురుగదాస్ నేటివిటీ టచ్ మరిచిపోకపోవడం అన్నది కూడా ప్లస్ పాయింట్.

ఇక మైనస్ లు అవుతాయేమో అనిపించే విషయాలకు వస్తే, స్పైడర్ జోనర్ ఫ్యామిలీలకు ఎంత వరకు టచ్ అవుతుందో చూడాలి. అది సినిమా బయటకు వస్తే తప్ప తెలియదు. కేవలం స్పై, ఇంటిలిజెన్స్ విషయాల మీదే సినిమా నడిస్తే, అది లేడీస్ ను ఎంత వరకు ఆకట్టకుంటుందో చూడాలి. ఎందుకంటే మహేష్ ఫ్యాన్స్ లో వారి సంఖ్య తక్కువేమీ కాదు.

ఏవరేజ్ అయితే

జై లవకుశ కావచ్చు, స్పైడర్ కావచ్చు ఏవరేజ్ టాక్ పనికిరాదు. హిట్ టాక్ రావాల్సిందే. ఎందుకంటే వాటి మార్కెట్ రేంజ్ అలా వుంది. ఏవరేజ్ టాక్ ఏ సినిమాకు వచ్చినా సమస్యే అవుతుంది. ముఖ్యంగా ఈ సమస్య స్పైడర్ కు ఎక్కువగా వుంటుంది. ఎందుకంటే జైలవకుశ ఏవరేజ్ అన్నా కూడా మహిళలు, జనరల్ ఆడియాన్స్ ఓసారి చూద్దాం అన్న ఆసక్తి వుండే అవకాశం వుంది. ఎందుకంటే అది ముగ్గురు అన్నదమ్ముల కథ. కామన్ ఆడియన్స్ కు దగ్గరగా వుండే కథ కానీ దూరంగా వుండేది కాదు.

కానీ స్పైడర్ విషయం వేరు. టెర్రరిజం, అది దృష్టించే భయోత్పాతాలు, దానిపై పరిశోధన. ఇది పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా వుండి తీరాల్సిందే. భలే తీసాడ్రా.. అనే టాక్ రావాల్సిందే.

విడుదల అడ్వాంటేజ్

జై లవకుశ వారం ముందుగా రావడం అన్నది అడ్వాంటేజ్. సినిమా టాక్ తో సంబంధం లేకుండా కనీసం నాలుగు రోజులు కలెక్షన్లు కుమ్మేస్తాయి. కానీ జైలవకుశకు కనుక స్పైడర్ కన్నా ఎక్కువ టాక్ వస్తే, అది స్పైడర్ కలెక్షన్ల మీద ప్రభావం చూపే ప్రమాదం వుంది. స్పైడర్ తొలివారం ఓకె. ఎందుకంటే పండగ సెలవులు. అదే టైమ్ లో జైలవకుశ కూడా అదే టైపు కలెక్షన్లు వస్తాయి. కానీ వన్స్, పండగ అయిపోయాక మాత్రం నిలబడాలి అంటే ఎవరికి ఎక్కువ టాక్ వస్తే వారిదే స్టాండ్ అవుతుంది.

ఇదిలా వుంటే ఈలోగానే శర్వానంద్ మహానుభావుడు సినిమా బరిలోకి వస్తోంది. ప్యూర్ ఫ్యామిలీ, యూత్ ఎంటర్ టైనర్. కనిపించడం లేదు కానీ, ఇది కూడా చిన్న విషయం కాదు. స్పైడర్, జై లవకుశల సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఏ మాత్రం చిన్న అలక్ష్యం చేసినా, ఆ సెక్షన్ ను మహానుభావుడు తన్నుకుపోతాడు.

చూడాలి దసరాకు ఈ మూడు సినిమాలు ఏం చేస్తాయో?