జనం, అభిమానులు భలే అల్పసంతోషులు, నాయకులు, హీరోలు చెప్పే డైలాగులకు పడిపోతారు. అందుకే వాళ్లు మాంచి పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి ఎంచుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేస్తున్నారని వినికిడి.
ఈరోజు సాయంత్రం జరిగే సర్దార్ అడియో ఫంక్షన్ లో పవన్ ఇటు అభిమానులను, అటు జనసేన అధిపతిగా జనాలను అలరించే ఓ డైలాగ్ చెబుతారని తెలుస్తోంది..జనం కోసం నేను..నా కోసం అనే మీనింగ్ వచ్చేలా ఆ డైలాగు వుంటుందని అంటున్నారు. ట్రయిలర్ లో కూడా వుంటుందని తెలుస్తోంది.
నో స్పాన్సర్
మొత్తానికి అడియో ఫంక్షన్ ఈవెంట్ కు స్పాన్సర్ లేకుండానే జరుగుతోంది. ఈ ఈవెంట్ ను ఓ ఈవెంట్ మేనేజింగ్ సంస్థకు ఇచ్చారు. అయితే చాలా తక్కువ సమయం కావడం, యాభై లక్షలు కేవలం స్పాన్సర్ గా, పాతిక లక్షలు ఈవెంట్ కు ఇవ్వాలంటే ఎవరు ముందుకు రాలేదని వినికిడి.దీంతో నిన్నటికి నిన్న వేరే ఈవెంట్ మేనేజ్ మెంట్ వారిని పిలిచి పని అప్పచెప్పారు. అలాగే కొంతమంది మెగాభిమానులకు పనులు అప్పచెప్పారు. వారే శనివారం రాత్రి నుంచి పనులు ప్రారంభించారు.
సాంగ్ లిరిక్
ఆడెవడన్నా..ఈడెవడన్నా….సర్దార్ అన్నకి ఎదురేఎదురేవద్దన్నా,
ఆడెవడన్నా..ఈడెవడన్నా....నీకు పోటీ ఎవడన్నా
ఆడెవడన్నా..ఈడెవడన్నా....నీలో దమ్ముకి సాటెవడన్నా..
ఇలాంటి పదాలతో ఓ పాట సర్దార్ గబ్బర్ సింగ్ లో వున్నట్లు తెలుస్తోంది.ఇది ఇంటర్వెల్ ముందు ఓ ఫైట్ కు బ్యాక్ డ్రాప్ లో వస్తుందని వినికిడి.