జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి రమ్మనమని ఆహ్వానించారు విశాఖ జిల్లా రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావును. కానీ ఆ తరువాత వీరభద్రరావు నుంచి స్పందన మాత్రం రాలేదు. ఆయన వస్తారో? రారో? తెలియలేదు. మరోపక్క తెలుగుదేశంలోకి వెళ్లాడానికి వీరభద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి.
అయితే తెలుగు దేశం నుంచి సరైన స్పందన, అంతకు మించి టికెట్ ఇస్తామన్న హామీ రాలేదని తెలుస్తోంది. అటు వెనక్కు తిరగి వైకాపాలోకి వెళ్లే పరిస్థితి లేదు. ఇక మిగిలింది జనసేన నే. అందుకే లేటెస్ట్ గా జనసేనలోకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కిందిస్థాయి కార్యకర్తలకు మెలమెల్లగా సందేశాలు పంపిస్తున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లాలో దాడి కి ప్రత్యేకంగా కార్యకర్తలు లేరు. వున్నవాళ్లంతా తెలుగుదేశం జనాలే. ఇప్పుడు దాడి వెంట ఎంత మంది జనసేన లోకి వెళ్తే, అంతమంది తెలుగుదేశాన్ని వీడినట్లే అవుతుంది.
అన్ని దోశలు ఎలా వేశావ్ భయ్యా.. ఆకలేసి ఫన్నీ వీడియో
కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్