కిర్రాక్ పార్టీ అంటూ చకచకా సినిమా ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకువచ్చేసాడు హీరో నిఖిల్. కన్నడ సినిమా రీమేక్ తరువాత తమిళ సినిమా రీమేక్ మీదకు వెళ్తున్నాడు. ఇంతకు ముందే ఒకె చేసిన గణితన్ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. టాగోర్ మధు నిర్మాత. ఈ సినిమా జనవరి 19నుంచి సెట్ మీదకు వెళ్తుంది. అప్పటికి కిర్రాక్ పార్టీ వర్క్ దాదాపు పూర్తయిపోతుంది.
2018లో కనీసం మూడు సినిమాలు చేయాలని నిఖిల్ పట్టుదలగా వున్నాడు. ఎలాగూ కిర్రాక్ పార్టీ ఫస్ట్ క్వార్టర్ లోనే విడుదలవుతుంది. గణితన్ కూడా మూడు నెలల్లో వర్క్ ఫినిష్ అయిపోతుంది.
అయితే ఆ తరువాత సినిమా మీద ఇంకా క్లారిటీ లేదు. చందు మొండేటి-నాగ చైతన్య సినిమా పూర్తయితే, దిల్ రాజు నిర్మాణంలో ఈ ఇద్దరు ఓ సినిమా చేయాల్సి వుంది. మరి అది చేస్తారా? లేక మరో ప్రాజెక్టు ఏదైనా టేకప్ చేస్తారా అన్నది చూడాలి.
చందు మొండేటి ప్రాజెక్టు కన్నా, వేరే ప్రాజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా వుందని తెలుస్తోంది.