నోటి దురుసు, చేతి దురుసు కారణంగా విమాన సంస్థల నుంచి నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు ఎంపీ జెసి దివాకర రెడ్డి. విశాఖ సంఘటన అనంతరం ఆయన వెకేషన్ కు విదేశాలకు వెళ్లిపోయారు. వచ్చేసారు.
అవన్నీ ఇంటర్నేషనల్ విమాన సంస్థలు కాబట్టి సమస్య లేకపోయింది. కానీ ఇక ఇక్కడకు వచ్చేసాక ఎక్కాల్సినవి డొమెస్టిక్ విమానాలే. అక్కడే సమస్య మళ్లీ ప్రారంభమైంది.
నిన్నటికి నిన్న హైదరాబాద్ లో ఎక్కిన విమానం నుంచి చాలా మర్యాదపూర్వకంగా దింపేసారు. మరో విమానంలో టికెట్ బుక్ చేసుకుంటే, వాళ్లు పోన్ చేసి మరీ రావద్దని చెప్పేసారు.
సరే, హైదరాబాద్ నుంచి విజయవాడ కాబట్టి, విలాసవంతమైన కార్లకు లోటు లేదు కాబట్టి, మూడు, నాలుగు గంటల్లో వెళ్లిపోతారు. కానీ ఎంపీగా, వ్యాపార వెత్తగా బోలెడు పనులు వుంటూ, నిత్యం దేశం మొత్తం తిరిగే జెసి, ఇకపై ఎలా నెట్టుకు వస్తారో?
ఈ పీట ముడి విడాలంటే జెసి క్షమాపణ చెప్పడమో, జరిగిన దానికి విచారం వ్యక్తం చేయడమో మాత్రమే విరుగుడు మంత్రం కావచ్చు. అది ఎప్పటికో ఓసారి జరగక తప్పదేమో?