‘జీవితా’శయం నెరవేరుతోంది

రాజకీయాల్లో రాణించాలన్నది నటి జీవిత ఆశయం. నిజానికి దీనివల్లనే హీరో రాజశేఖర్ కెరీర్ పాడయిందనీ సినీరంగంలో గుసగుసలు వినిపిపిస్తాయి. ఆమె తరచు పార్టీలు మారడం వల్ల ఆయన కూడా ఆమె వెంటే ప్రయాణించాల్సి వచ్చింది.…

రాజకీయాల్లో రాణించాలన్నది నటి జీవిత ఆశయం. నిజానికి దీనివల్లనే హీరో రాజశేఖర్ కెరీర్ పాడయిందనీ సినీరంగంలో గుసగుసలు వినిపిపిస్తాయి. ఆమె తరచు పార్టీలు మారడం వల్ల ఆయన కూడా ఆమె వెంటే ప్రయాణించాల్సి వచ్చింది. తన కెరీర్ వదిలేసి వివిధ వివాదాల్లో తలదూర్చాల్సి వచ్చింది. దీంతో సినిమాలపై దృష్టి సన్నగిల్లింది. తెలుగుదేశం, ఎన్టీఆర్, కాంగ్రెస్, భాజపా ఇలా రకరకాలుగా తిరిగిన తరువాత ఇప్పటికి ఓ పదవి వరించింది. ఇది మరే విధంగా ఆమెకు ఉపయోగపడుతుందో, లేదో కానీ, ఢిల్లీ స్థాయిలో ఆమె తన సర్కిల్ పెంచుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. 

అంతా బాగానే వుంది. కానీ మోడీ చరిష్మా ప్రారంభం కాని రోజుల నుంచి మన సినిమా రంగం నుంచి నరేష్, సాయికుమార్ వంటి వారు భాజపాను నమ్ముకుని వున్నారు. కానీ వారికి ఒరిగింది లేదు. నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన జీవితకు టక్కున అవకాశం లభించింది. మరి దీన్ని బట్టి భాజపా కూడా అన్ని పార్టీల్లాంటిదే అని అనిపిస్తోంది. అదీ గాక సెన్సారు అనేది నిర్మాతలు తీసే సినిమాలను కంట్రోలు చేయడానికి. అవి సరైన దారిలో వుండేలా చూడడానికి కానీ ఓ నిర్మాత కమ్ దర్శకురాలిని తీసకెళ్లి మెంబర్ గా వేయడం అంటే ఏమనుకోవాలి?

ఏమైతేనేం ఇన్నాళ్లు జీవిత జీవితాశయం నెరవేరుతోంది అనుకోవాలి.