Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జోరుగా..హుషారుగా బెంగాల్ టైగర్

జోరుగా..హుషారుగా బెంగాల్ టైగర్

బెంగాల్ టైగర్..రవితేజ-సంపత్ నంది కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా. బలుపు, పవర్ వంటి హిట్ చిత్రాల త‌రువాత  రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నాలు   హీరోయిన్స్ గా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్  త‌రువాత సంపత్ నంది రూపొందింస్తున్న చిత్రం ఇది.. సంపత్ నంది..ఫస్ట్ చిన్న సినిమా చేసి, అందరి దృష్టిని తన వైపు తిప్పుకుని, రామ్ చరణ్ పిలుపు అందుకుని రచ్చ..చేసాడు. ఆ వెంటనే పవర్ స్టార్ దృష్టిని ఆకర్షించాడు. గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ మీద ఏడాది కృషి చేసాడు. బ్యాడ్ లక్. ఎక్కడో ఏదో జరిగింది..కానీ కష్టం ఎక్కడికీ పోదు. అందుకే రవితేజ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. 

బెంగాల్ టైగర్ అనే సూపర్ సబ్జెక్ట్ రెడీ చేసాడు. టైటిల్ తోనే సగం హైప్ తీసుకు వచ్చాడు. దాదాపు రెండేళ్ల విరామం తెచ్చిన కసితో ఈ సినిమాను చేస్తున్నాడు సంపత్ నంది.  రవితేజకు టైలర్ మేడ్ వంటి ఎనర్జిటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ బెంగాల్ టైగర్ అంటున్నారు సంపత్ నంది. కేవలం హీరోయిజం మాత్రమే కాకుండా, ప్రతినాయక పాత్ర కూడా పవర్ ఫుల్ గావుంటుందని, అందుకే బోమన్ ఇరానీ వంటి నటుడిని తీసుకున్నామని అంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించి, రామెజిఫిల్మ్ సిటిలో రామ్‌ల‌క్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫిలో యాక్ష‌న్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ స‌న్నివేశాలు ఫాంట‌మ్ కెమెరాతో చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్ జులై మెద‌టివారం వ‌ర‌కూ జ‌రుగుతుంది. జూన్‌20 నుండి బోమ‌న్ ఇరాని కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో పాల్గోంటారు..   ఈ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని, బెంగాల్ టైగ‌ర్ ని వినాయ‌క చ‌వితి సంద‌ర్బంగా విడుద‌ల చేస్తారని యూనిట్ ఛెబుతోంది.

బెంగాల్ టైగర్ తో తన సత్తా మరోసారి చాటి చెప్పాలని చూస్తున్న డైరక్టర్ సంపత్ నంది బర్త్ డే రేపు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?