Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జెపి లైన్లోకి వచ్చేసారు.. ఇక నో ప్రాబ్లమ్

జెపి లైన్లోకి వచ్చేసారు.. ఇక నో ప్రాబ్లమ్

''... ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారనే రీతిలో మాట్లాడడాన్ని జెఎఫ్‌సి తప్పుపడుతోంది...'' జయప్రకాష్ నారాయణ్.

హమ్మయ్య ఓ సమస్య తీరిపోయింది. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టినపుడు చంద్రబాబు ఓ మాట అన్నారు. పవన్ కళ్యాణ్ కానీ ఆయన కమిటీ కానీ, కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై దృష్టి పెట్టాలి కానీ, రాష్ట్రం ఎలా ఖర్చుచేసింది అన్న దానిపై కాదు అని. అంటే అక్కడే అర్థం అయిపోయింది. రాని లెక్కలు చెబుతారు కానీ, ఖర్చు లెక్కలు చెప్పరని.

కానీ కేంద్రం ఏమంటోంది. ఖర్చు వివరాలు చెప్పకే తరువాత భాగం నిధులు ఇవ్వడం లేదంటోంది. ఇలాంటి టైమ్ లో ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నపుడు ఈ విషయంపై కూడా డిస్కస్ చేయాలి. కానీ డిస్కషన్ కు కూర్చోవడానికి ముందే చంద్రబాబు ఈ మాట అన్నారు.

సరే, డిస్కషన్ కు కూర్చున్నారు. కానీ చాలా తెలివిగా పవన్ కానీ, మిగిలన వారు కానీ ఇప్పుడు ఖర్చుల విషయం పక్కకు తప్పించేసారు. పవన్ అసలు ఆ విషయమే ప్రస్తావించలేదు. జయప్రకాష్ అయితే ఖర్చుల గురించి మాట్లాడడమే మహా పాపం అన్నట్లు ఓ మాట పడేసారు.

అంటే, 'కూకట్ పల్లి' సారు లైన్లోకి వచ్చేసారు. జనసత్తా తరపున ఎంచుకుని, ఏరి కోరి కూకట్ పల్లి నుంచి జయప్రకాష్ సారు ఎందుకు పోటీచేసారన్నదానిపై వదంతులు కూడా వున్నాయి. ఆ తరువాత మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసే ప్రయత్నం చేసే వరకు చంద్రబాబుకు అనుకూలంగానే వున్నారు. కానీ ఆ తరువాతే కాస్త మాట మార్చి రుసరుసలు ఆడారు.

కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే మళ్లీ లైన్లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో మాజీ చీఫ్ సెక్రటరీ ఐవిఆర్ కృష్ణారావు ఒక్కరే ఖర్చుల వివరాలు పరిశీలిద్దాం అన్నారట. కానీ మిగిలిన వారు అటు వుంటే ఆయన ఒక్కరి మాట ఎలా చెల్లుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?