ఎన్టీఆర్ విషయంలో వెనక్కు తగ్గిన లోకేష్ అండ్ కో!

‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షోలకు ఎట్టకేలకూ అనుమతి లభించింది. వీటి విషయంలో ఉన్న ఉత్కంఠకు తెరపడి.. తారక్ అభిమానులకు ఊరట లభించింది. ఈ విషయం లో ఇంత కన్నా పంచాయితీ చేస్తే.. పరువు పోతుంది,…

‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షోలకు ఎట్టకేలకూ అనుమతి లభించింది. వీటి విషయంలో ఉన్న ఉత్కంఠకు తెరపడి.. తారక్ అభిమానులకు ఊరట లభించింది. ఈ విషయం లో ఇంత కన్నా పంచాయితీ చేస్తే.. పరువు పోతుంది, సొంత సామాజికవర్గమే అసహ్యించుకుంటోంది అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వ పెద్దలు బెనిఫిట్ షోలకు అనుమతిని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ స్థాయిలో జరిగిన మంత్రాంగంతో జనతా గ్యారేజ్ బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు సమాచారం.

ఈ సినిమా బెనిఫిట్ షోలు ఉండవని.. థియేటర్ల ఓనర్లకు, డిస్ట్రిబ్యూటర్ల కు అధికారులు ముందుగానే చెప్పేయడంతో ఈ వ్యవహారం అభిమానుల వరకూ వెళ్లి వారిలో ఆందోళన పెంచింది. ఇక ఎన్టీఆర్ అభిమాన వర్గంలో క్రియాశీలంగా ఉన్నది కమ్మ సామాజికవర్గం వాళ్లే కావడంతో.. ఈ విషయంపై వారు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రులనే కలిసి తమ నిరసనను తెలియజేశారు.

అయితే ఎన్టీఆర్ సినిమాలకు ఆటంకాలు కల్పించడం అధిష్టాన నిర్ణయం.. ఈ విషయంలో తాము ఏం చేయలేనట్టుగా సదరు మంత్రులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొందరు కమ్మ సామాజికవర్గ ప్రముఖులు రంగంలోకి దిగి, తత్వ బోధ చేసినట్టు సమాచారం.

ఈ కుల  పెద్దల బోధలో.. ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుని మీరు సాధించుకునేది చెడ్డ పేరే, ఈ ఆటంకాలకు కారణం చంద్రబాబు, బాలయ్య లే అనేది అందరికీ అర్థమైపోతుంది. సొంత కులస్తుడిని ఇబ్బంది పెట్టడమే తప్ప అంతకు మించి చేయగలిగిందేమీ లేదని గుర్తుంచుకోండన్న వారి హితబోధతో జనతా గ్యారేజ్ బెనిఫిట్ షోల విషయంలో లోకేష్ అండ్ కో వెనక్కు తగ్గినట్టుగా ప్రచారం జరుగుతోంది.