జుద్వా-2 వస్తోంది.. హలోబ్రదర్-2 కూడా వస్తే బాగుండేది!

తెలుగులో హలో బ్రదర్ పెద్ద హిట్. అది హిట్ అయిన మూడేళ్ల తర్వాత దాని రీమేక్ గా హిందీలో జుద్వా వచ్చింది. అది కూడా హిట్ అయింది. మళ్లీ ఇన్నేళ్లకు బాలీవుడ్ లో జుద్వా-2…

తెలుగులో హలో బ్రదర్ పెద్ద హిట్. అది హిట్ అయిన మూడేళ్ల తర్వాత దాని రీమేక్ గా హిందీలో జుద్వా వచ్చింది. అది కూడా హిట్ అయింది. మళ్లీ ఇన్నేళ్లకు బాలీవుడ్ లో జుద్వా-2 వస్తోంది.

సీక్వెల్ కు కూడా డేవిడ్ ధావనే దర్శకత్వం వహించాడు. ఈ సెప్టెంబర్ లో అది థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో హలోబ్రదర్-2 కూడా వస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది.

కంప్లీట్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కింది హలో బ్రదర్ సినిమా. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

అప్పట్లో ఈ సినిమాకు అన్నీ సెట్ అయ్యాయి. పంచ్ డైలాగులు, పాటలు, ఆర్టిస్టులు.. ఇలా అందరూ కుదిరారు. తర్వాత ఈ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని.. నాగచైతన్య, అఖిల్ వద్దకు కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఏవీ కార్యరూపం దాల్చలేదు.

సరిగ్గా ఇలాంటి టైమ్ లో జుడ్వా-2 సినిమా వస్తోంది. అప్పట్లో సల్మాన్ ఖాన్ చేసిన పాత్రను పార్ట్-2లో వరుణ్ ధావన్ పోషిస్తున్నాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తాప్సి హీరోయిన్లు.

ఈ సినిమా హిట్ అయితే హలోబ్రదర్-2 గురించి అక్కినేని ఫ్యామిలీ ఆలోచించే అవకాశాలున్నాయి. నాగార్జున నటించకపోయినా.. తను నిర్మాతగా నాగచైతన్య లేదా అఖిల్ లో ఎవరితోనైనా పార్ట్-2 తీసే ఛాన్స్ ఉంది.

అయితే ఈవీవీ రేంజ్ లో కామెడీని పండిస్తూ హలోబ్రదర్-2 తీసే దర్శకుడ్ని సెలక్ట్ చేయడం మాత్రం నాగార్జునకు కత్తిమీద సామే.