పూరి ఏం చేసినా అందులో ఓ కిక్కుంటుంది. జ్యోతి లక్ష్మి టైటిల్ తోనే ఆ కిక్ తీసుకొచ్చేసాడు. ఆ టైటిల్ కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ట్రయిలర్ తో బి సి సెంటర్ల బయ్యర్లకు ఆశలు రేపాడు. దాంతో బిజినెస్ ప్రారంభమైపోయింది.
వైజాగ్ ఏరియాకు మోహినీ ఫిలింస్ సంస్థ దగ్గర దగ్గర కోటి రూపాయిలకు రైట్స్ తీసుకుంటూ బోణీ కొట్టినట్లు తెలుస్తోంది. ట్రయిలర్ లో బి సి లకు కావాల్సిన డ్యాన్స్ లు, చార్మి హోయలు విస్తారంగా వుండడమే బయ్యర్ల ఆసక్తికి కారణంగా తెలుస్తోంది.
వైజాగ్ రేటు బేస్ చేసుకుని, మిగిలిన ఏరియాల బిజినెస్ వుంటుంది. అంటే దాదాపు పది నుంచి పది హేను కోట్ల మధ్యన బిజినెస్ జరిగేలాగే వుంది. శాటిలైట్ దీనికి తోడయితే, ఇక నిర్మాణంలో పాలుపంచుకున్న చార్మికి పండగే.