విడుదల ఒక రోజు దూరంలోకి వచ్చేసరికి రజనీ కాంత్ కబాలి టీమ్ ముందు జాగ్రత్త పడుతోంది. ఇన్నాళ్లు వదిలిన ట్రయిలర్లు వేరు. ఓ మాంచి పవర్ ఫుల్ యాక్షన్ సినిమా లుక్ వచ్చే ట్రయిలర్లు వదిలారు. కానీ సినిమా కాస్త క్లాస్ మూవీ, అని స్లో నెరేషన్ అని టాక్ మెల్లగా బయటకు వస్తోంది.
మరోపక్క కావాలనే సినిమా విషాదాంతం అనే ఫీలర్ ను ఇప్పుడు బయటకు పంపారు. అంటే దీన్ని బట్టి మెల్లగా ప్రేక్షకులను సినిమా ఎలా వుంటుందనే దానిపై ప్రిపేర్ చేసే కార్యక్రమం మొదలయింది అని అర్థం అవుతోంది. ఒక విధంగా ఇది మంచిదే.
బహుశా అందుకే కావచ్చు, క్లయిమాక్స్ విషయంలో రజనీ తనకు అండగా నిలిచారని, ఎలా అనుకుంటే అలాగే వెళ్లమని ప్రోత్సహించారని దర్శకుడు రంజిత్ చెబుతున్నారు. అంటే ఇండైరెక్ట్ గా సినిమా విషాదాంతం అన్నమాట అని ఇప్పుడు మీడియా ప్రచారం ప్రారంభింది.
ప్రేక్షకులు ఒకలా ఊహించుకుని, సినిమా మరొకలా వుంటే వచ్చే ఇబ్బందులు వేరు. అంతకన్నా ముందే సినిమా జోనర్ ఇది అని తెలిసి వెళ్లే ప్రేక్షకులు వాళ్లు ఫీల్ కాకుండా, సినిమాను ఫీల్ అవడానికి అవకాశం వుంటుంది.