Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్.. ఏమవుతోంది?

ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్.. ఏమవుతోంది?

ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ఇద్దరూ సోదరులు. విపరీతమైన అనుబంధం వుంది. ఇద్దరూ ఒకే మాట.. ఒకటే బాట అన్నట్లు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లు గ్యాసిప్ వచ్చినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి ఎందుకు, ఎలా, విషయం ఏమిటి అన్నది క్లారిటీ లేదు కానీ సమ్ థింగ్.. సమ్ థింగ్… అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

కళ్యాణ్ రామ్ సినిమా వస్తోంది అంటే ఆ సినిమా ప్రీ రిలీజ్ కు ఎన్టీఆర్ పక్కాగా వస్తారని ఫ్యాన్స్ అంచనా వేస్తారు. కానీ డెవిల్ సినిమా విడుదల వుంది. ప్రీ రిలీజ్ వుంటుందని తెలిసి కూడా ఎన్టీఆర్ టూర్ పెట్టుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే తమకు కావాల్సిన వాళ్ల సినిమా, నచ్చిన వాళ్లు విషయం అంటే ఓ ట్వీట్ వేయడం అన్నది కామన్. తన బావమరిది సినిమా మ్యాడ్ టైమ్ లో ఎన్టీఆర్ ట్వీట్ వేసారు. కానీ డెవిల్ సినిమా గురించి ట్వీటే వేయలేదు. అలాగే జూన్ నుంచి ఆగస్ట్ మధ్యలో ఎన్టీఆర్ ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. జూలై లో కళ్యాణ్ రామ్ బర్త్ డే వుంది. దానికి ట్వీట్ వేయలేదు. మహేష్ బర్త్ డే కు ట్వీట్ వేసారు. చిరంజీవి బర్త్ డే కు ట్వీట్ వేసారు.

బబుల్ గమ్ సినిమా రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా తయారవుతోంది. దానికి కూడా ఎన్టీఆర్ ఏ ట్వీట్ వేయలేదు. నిజానికి రాజీవ్ చాలా సన్నిహిత మిత్రుడు ఎన్టీఆర్ కు. అయితే దానికి వేసి, డెవిల్ వేయకుండా అందరి దృష్టిని ఆకర్షించినట్లు అవుతుందని, వేయలేదని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

దేవర సినిమా విషయంలోనో, మరెందుకో కళ్యాణ్ రామ్ కు-ఎన్టీఆర్ కు గ్యాప్ వచ్చిందన్నది వినిపిస్తున్న గ్యాసిప్. దేవర సినిమాలో కళ్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామి. అ సినిమా వర్క్ కి కూడా చిన్న చిన్న సమస్యలు వున్నాయనే గ్యాసిప్ కూడా వినిపిస్తోంది. మొత్తం మీద ఈ గ్యాసిప్ ల్లో నిజమెంతో మరి వారిద్దరికే తెలియాలి. లేదా వారి సన్నిహితులకు తెలియాలి.

ఈ విషయమై ఎన్టీఆర్ పీఆర్ టీమ్ కు సంబంధించిన నాని, వంశీకాకా ను సంప్రదించగా… నవ్వేసి… ఇదంతా మీ స్పెక్యులేషన్ తప్ప మరేం కాదు అని చెప్పారు. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ బంధం ఇంతకు ముందు ఎలా వుందో ఇప్పుడూ అలాగే వుందన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?