పటాస్ కు ముందు కళ్యాణ్ రామ్ చాలా దెబ్బలు తిన్నాడు. ఉన్నదంతా పెట్టి, ఓం త్రీడీ తీస్తే, ఆశించిన ఫలితం రాలేదు. సుమారు 15 కోట్ల వరకు పివిపి దగ్గర ఇతరత్రా ఫైనాన్స్ తెచ్చి పటాస్ చేసాడు. హిట్ కొట్టాడు. దాంతో ఈ సినిమాకు తెచ్చినవి, పాతవి చాలా వరకు తీరాయని వినికిడి. అయితే, మరోసారి సేఫ్ జోన్ లో తన సినిమా తాను చేసుకోకుండా రవితేజతో కిక్ 2 అని ప్రారంభించాడు. రవితేజ హిట్ మార్కెట్ మహా అయితే 30 వరకు వుంటుంది మాగ్జిమమ్. అయితే ఇటచల రవితేజ సినిమాలకు కొనుగోళ్లు తగ్గాయని వినికిడి. పవర్ సినిమా హిట్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ, మరీ లాభాలేమీ గొప్పగా తెచ్చేసుకోలేదని టాక్. ఇలాంటి నేపథ్యంలో కళ్యాణ్ రామ్ చేత దర్శకుడు సురేందర్ రెడ్డి ఏకంగా ముఫై వరకునో, ముఫై పైనో సినిమాకే ఖర్చు చేయించేసాడని వినికిడి. ఇప్పుడు ఈ సినిమా అమ్మకాలో పంపిణీ ఏర్పాట్లో అయితే అయిపోయాయి. కానీ ఓవర్ ఫ్లోస్ వస్తే తప్ప కళ్యాణ్ రామ్ కు లాభాలు రావడం కష్టం అన్న వదంతి వినిపిస్తోంది.