Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కళ్యాణ్ రామ్ సెకెండ్ మేకోవర్

కళ్యాణ్ రామ్ సెకెండ్ మేకోవర్

సినిమా సినిమాకు డిఫరెంట్ గా కనిపించాల్సిన కాలం ఇది. ఈ జనరేషన్ హీరోలకు ఇది తప్పని సరి వ్యవహారం అయిపోయింది. పూరి జగన్నాధ్ సినిమా కోసం హీరో కళ్యాణ్ రామ్ ఫుల్ గా మేకోవర్ అయ్యాడు ఏడాది క్రితం. సిక్స్ ప్యాక్, రఫ్ లుక్ తో డిఫరెంట్ గా కనిపించాడు.

అలాంటి వాడు ఇప్పుడు మళ్లీ మరోసారి గెటప్ మార్చేసాడు. ఎమ్మెల్యే సినిమా స్టిల్స్ పూర్తిగా బయటకు వచ్చాయి. బయట పబ్లిసిటీ హోర్డింగ్ లు కనిపిస్తున్నాయి. చూసిన వారంతా కళ్యాణ్ రామ్ ఈ రేంజ్ లవర్ బాయ్ లుక్ లోకి భలే మారాడు అన్న అప్లాజ్ ఇస్తుండడం విశేషం.

బృందావనం టైమ్ లో ఎన్టీఆర్ లుక్స్ ను దృష్టిలో వుంచుకుని, క్లీన్ షేవ్ తో క్లాస్ లుక్స్ ట్రయ్ చేసాడట కళ్యాణ్ రామ్. పటాస్ లో అతగాడి కామెడీ టైమింగ్ పండింది. అందుకే ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు.

శ్రీను వైట్ల అసిస్టెంట్ ఉపేంద్ర తయారుచేసిన సింపుల్ స్క్రిప్ట్. కానీ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్. స్క్రిప్ట్ తెచ్చినపుడు పూర్తి ఫన్ తో వుందట. లవ్ ట్రాక్ జస్ట్ లీడ్ గా వుందట. అయితే లవ్ ట్రాక్ ను ఇంప్రూవ్ చేసి, ఫన్ జోనర్ ను అలాగే వుంది కళ్యాణ్ రామ్ కు అనుగుణంగా షేపప్ చేసారట.

అంటే కళ్యాణ్ రామ్ నే కాదు, ఎమ్మెల్యే స్క్రిప్ట్ కూడా మేకోవర్ అన్నమాట. ఈ సినిమా 23న విడుదలవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?