అతి కష్టం మీద కంచె సినిమా సుమారు 450 థియేటర్లలో విడుదలయింది. నిజానికి అదే డేట్ కు అఖిల్ విడుదల కావాల్సి వుంది. అఖిల్ కోసం వెయ్యి స్క్రీన్ ల వరకు సెట్ చేసి వుంచారని వినికిడి. మరి ఆ స్క్రీన్ లు అన్నీ ఏమయ్యాయి? రాజుగారి గది సినిమాను సాయి కొర్రపాటి కొనడంతో సీడెడ్, కృష్ణాలో ఆయనకు లింక్ వున్న థియేటర్లు కొన్ని అటు వెళ్లాయి.
లాస్ట్ మినిట్ లో కొలంబస్ సినిమా వెళ్లి, సురేష్ మూవీస్ తో అగ్రిమెంట్ పెట్టుకుంది. దాంతో సురేష్ థియేటర్లు అటు పోయాయి. అయినా మరి కొన్ని స్క్రీన్లు దొరికే వీలు వుందట. కానీ అలా కంచెకు దక్కుతాయి అనుకున్న స్క్రీన్లను కూడా రానివ్వకుండా చేసారన్న గ్యాసిప్ వినిపిస్తోంది.
ఇప్పుడు కంచెకు థియేటర్ ఇస్తే, భవిష్యత్ లో తమ సినిమాలు ఇవ్వమని 'ఎవరో' ముందుగా హెచ్చరించారని అంటున్నారు. దీంతో కంచె దొరికిన థియేటర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా కూడా,తొలి రెండు రోజులకు కలిపి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయిదు కోట్ల వరకు వసూళ్లు సాగించింది.
శని, ఆదివారాలు ఇంకా పెరుగుతుందని ట్రేడ్ వర్గాల బోగట్టా. అంటే వీకెడ్ వసూళ్లు 12దాకా వుంటాయంటున్నారు. ఇది కాక ఓవర్ సీస్ వుంది. సోమవారం డ్రాపింగ్ లేకుండా వుంటే కొన్న స్క్రీన్ లు దొరికే అవకాశం వుందని బోగట్టా.