కంచె సినిమాకు నిన్నటికి నిన్న చకచకా సెన్సారు జరిగిపోయింది. దీంతో టాలీవుడ్ లో కొత్త గుసగుస వినిపించడం ప్రారంభించింది. నవంబర్ కు వెళ్లిన కంచె, ఇఫ్పటికిప్పుడు సెన్సారు చేయించడం వెనుక కారణం ఏమై వుంటుంది అన్నది విషయం. రుద్రమదేవి కష్టాలు ఇంకా తీరలేదని, ఆఖరి క్షణం వరకు అవి వెన్నాడుతూనే వుంటాయని, తొమ్మిదిన రాకపోయినా ఆశ్చర్యం లేదని వార్తలు వినవస్తున్నాయి.
ఆ రోజున వస్తామని చెప్పిన సైజ్ జీరో నవంబర్ 20కు ఫిక్సయిపోయింది. దీంతో రుద్రమదేవి రాకుంటే 9 స్లాట్ ఖాళీగా వుండిపోతుంది. అందువల్ల దాన్ని ఎందుకు వాడుకోకూడదు అని కంచె నిర్మాతలు ఆలోచించి, ఎందుకైనా మంచిది అని సెన్సారు చేయించి వుంచారని తెలుస్తోంది. అయితే ఆ మరుసటి వారమే రామ్ చరణ్ బ్రూస్ లీ వుంది.
ఇద్దరు మెగా క్యాంప్ హీరోలు వరుసగా ఈ వారం తరువాతి వారం వదుల్తారా అన్నది అనుమానం. ఇలా చేయడం ఉభయులకూ, అభిమానులకు ఇబ్బందే. కానీ ఏ అభ్యంతరం లేకుంటే విడుదల చేయాలనే ఆలోచన మాత్రం కంచె నిర్మాతల్లో వుంది అని వినికిడి.