Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

కన్నడ లో కూడా టూకంట్రీస్

కన్నడ లో కూడా టూకంట్రీస్

మలయాళంలో పెద్ద హిట్ అయిన టూ కంట్రీస్ సినిమా ఇప్పుడు కన్నడంలోకి కూడా వెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఎన్ శంకర్ డైరక్షన్ లో సునీల్ హీరోగా నటిస్తున్నాడు. అయితే టాలీవుడ్ కు చెందిన నిర్మాతలు ఇద్దరు కలిసి కన్నడంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు.

మన సునీల్ మాదిరిగా కన్నడంలో టాప్ కమెడియన్ అయిన శరణ్ ను హీరోగా తీసుకుంటున్నారు. తెలుగుతో పోల్చుకుంటే కన్నడంలో నిర్మాణ వ్యయం తక్కువగా వుంటుంది. పైగా శరణ్ కు అక్కడ మంచి క్రేజ్ వుంది. అందువల్ల అక్కడ టూ కంట్రీస్ రీమేక ను ప్రారంభిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా నిర్మాణం వచ్చేనెలలో ప్రారంభమవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?