సౌత్ కాదు..ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్. అయితే..మాకేంటీ అంటున్నారు బయ్యర్లు. సినిమాను తెలుగు రైట్స్ 32 కోట్ల మేరకు కొనేసారు. కానీ ఇప్పుడు అమ్మాలంటే అమ్మో అనిపిస్తోంది. నైజాం ఏరియాకు జస్ట్ పదికో, పదకొండుకో తీసుకోండి బాబూ అంటే, అబ్బే అంత లేదు ఎనిమిది అయితే ఓకె అని అంటున్నట్లు తెలుస్తోంది. సినిమాను కొన్నవాళ్లు గీతా ఆర్ట్స్ దగ్గర వుంచారు. వాళ్లు దీన్ని ఏరియాలవారీ అమ్మాలి అనుకుంటుంటే, కొన్ని ఏరియాలు ఓకె కానీ, చాలా ఏరియాల బిజినెస్ ఇంకా మాటల్లోనే వుందని వినికిడి.
రజనీకాంత్ గత సినిమాల ఫ్రభావం ఇదంతా అని అనుకోవాలి. దీనికి తోడు ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. 14 అన్నారు..కాదు 22 అన్నారు. అబ్బే 29 అని వినిపిస్తోంది. కబాలి విడుదల ఎంత జోక్ అయిపోయిందంటే, వస్తే రానీండి..అంటూ జక్కన్న లాంటి మీడియం రేంజ్ సినిమా 22 కు, వెంకీ లాంటి సీనియర్ హీరో సినిమా 29కి ఫిక్స్ అయిపోయాయి. అంటే కబాలి విడుదల మీద అంత నమ్మకం అన్నమాట. లేటెస్ట్ బజ్ ఏమిటంటే ఆగస్టు 5 అని.
కానీ యూనిట్ వర్గాలు మాత్రం ఇంకా 22నే విడుదల అని, 21 వరల్డ్ ఫ్రీమియర్ అని, థియేటర్లు రెడీ చేసుకోండని అంటున్నాయట. ఇక్కడ చూస్తే బిజినెస్ కావడం లేదు. ఏమిటో ఈ కబాలి గందరగోళం.