పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రిలీజ్ డేట్ మార్చి 29 అంటూ ఎప్పుడో లాక్ చేసారు. కానీ రెండు మూడువారాల క్రితం నాలుగైదు రోజులు ముందుకు వచ్చి 24న ఫిక్సయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పనులు అనుకున్న రేంజ్ లో జరగకపోవడంతో మళ్లీ 29 డేట్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి రెండు మూడు ప్రధాన కారణాలు వినిపిస్తున్నాయి.
ఒకటి పాటలు ఫినిష్ అయ్యేసరికి ఈనెల 15వ తేదీ వస్తుంది. ఆ పైన వాటికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ లో వుంటుంది. రెండవది సినిమాకు ప్రచారం ఇంకా స్టార్ట్ కాలేదు. 14న యూరప్ నుంచి పవన్ తిరిగి వస్తారు. ఆయన వన్ డే రెస్ట్ తీసుకుని ప్రచారం స్టార్ట్ చేసినా గట్టిగా వారం టైమ్ వుండదు.
మూడవది అన్నిరకాల పరీక్షలు ఇంకా 26, 27 దాకా వుంటాయని తెలుస్తోంది. అందువల్ల ఓఫెనింగ్స్ ఎఫెక్ట్ అవుతాయేమో అన్న ఆలోచన కూడా వుంది. ఇలా ఈ మూడు కారణాల వల్ల కాటమరాయుడు డేట్ డైలామాలో పడింది.