కాటమరాయుడు సినిమా విడుదల దగ్గర పడుతోంది. అయితే అదే సమయంలో దానిపై గుసగుసలు వినిపించడం ప్రారంభమైంది. దీంతో కొన్న బయ్యర్లు కాస్త కిందా మీదా అవుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.
ఇప్పటిదాకా విడుదల చేసిన స్టిల్స్, కానీ వర్కింగ్ స్టిల్స్ కానీ, టీజర్ కానీ అద్భుతం అనే రేంజ్ లో ఏవీ లేవు అన్నది వాస్తవం. దానికి తోడు విడుదల రెండు పాటలు సో సోనే. మరోపక్క స్టోరీ మార్చేసారని టాక్. మరి ఏమేం ఏడ్ చేసారో చూడాలి.
కాటమ రాయడు సేల్స్ ఫిగర్లు తక్కువేమీ కాదు. ఒక్క నైజాం నే 18 నుంచి 20 కోట్ల మధ్యలో విక్రయించారు. సర్దార్ గబ్బర్ సింగ్ నైజాంలో పన్నెండు కోట్ల దగ్గరలో ఆగిపోయింది. విశాఖ ఎనిమిది కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. సర్దార్ నాలుగు కోట్ల మేరకు వసూళ్లు సాగించింది. పోనీ సూపర్ బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది చూసుకున్నా ఉత్తరాంధ్ర వసూళ్లు ఆరుకోట్లే. సీడెడ్ అత్తారింటికి వసూళ్లు పది కోట్ల మేరకు. కాటమరాయడు అమ్మకాలు 12 కోట్ల మేరకు.
కాటమరాయుడు అమ్మకాలు అన్నీ ఇటీవల బ్లాక్ బస్టర్ అయిన ఖైదీ నెంబర్ 150 ని దృష్టిలో పెట్టుకుని జరిగాయి. నిజానికి ఖైదీ నెం 150 ఆ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కాటమరాయుడు కూడా అలా ఊహించని రేంజ్ విజయం సాధిస్తేనే ఆ రేంజ్ కలెక్షన్లు సాధ్యపడతాయి.
కానీ శృతిహాసన్, పవన గెటప్ లు, సాంగ్స్, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇలా ఒక్కొటీ చూసుకుంటే కాస్త నిరాశ మాటలు వినిపిస్తున్నాయి. కానీ బయ్యర్లకు ఒక్కటే ఆశ. అది పవన్ కు వున్న ఫ్యాన్ బేస్. అందువల్లనే డిజాస్టర్ అనుకున్న సర్దార్ కూడా యాభై కోట్ల కు పైగా వసూళ్లు సాగించగలిగింది. కాటమరాయుడుకు సర్దార్ కన్నా బెటర్ టాక్ వస్తే ఆ వసూళ్లు డెభై కోట్ల రేంజ్ కు చేరతాయి. లేదూ సూపర్ డూపర్ టాక్ వస్తే అప్పుడు బయ్యర్లు గట్టెక్కుతారు.