చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా విడుదలైన రోజే, ఆ సినిమాలోని కొన్ని సీన్స్ ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చాయి. అయితే, క్షణాల్లో వాటిని తొలగించేందుకు నడుం బిగించాడు నిర్మాత రామ్‌చరణ్. చాలా సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది. కొన్ని సినిమాలకైతే విడుదలకు ముందే ఈ లీకేజీ సమస్య వెంటాడుతోందనుకోండి.. అది వేరే విషయం.
ఇక, అసలు విషయానికొస్తే, 'కాటమరాయుడు' సినిమాకి సంబంధించిన చాలా సీన్స్ నిన్న మార్నింగ్ షోకి ముందే యూ ట్యూబ్‌లో కన్పించేశాయి. మధ్యాహ్నానికే సినిమా మొత్తం యూ ట్యూబ్‌కి ఎక్కేసింది. చిత్రంగా, చిత్ర నిర్మాత ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోకపోవడం విశేషమే మరి. ఓపెనింగ్ సీన్ దగ్గర్నుంచి, ఎండింగ్ టైటిల్స్ దాకా ముక్కలు ముక్కలుగా 'కాటమరాయుడు' వీడియోలు ఇంటర్నెట్‌లో దొరికేస్తోంటే, మూవీ వసూళ్ళ పరిస్థితి ఇంకెలా వుంటుంది.? ఊహించుకోవడమే కష్టం కదా.!
మొత్తమ్మీద, నిర్లక్ష్యం 'కాటమరాయుడు' కొంప ముంచేసింది. పబ్లిసిటీ విషయంలో దారుణమైన డల్‌నెస్ కన్పించింది. అసలు పవన్‌కళ్యాణ్, మీడియా ముందుకొచ్చేందుకే సుముఖత వ్యక్తం చేయలేదు. సినిమా విడుదలయ్యాక.. పైరసీ దెబ్బ.. అసలు, 'కాటమరాయుడు' సినిమా విషయంలో ఎందుకింత లైట్ తీసుకున్నారట.? ఏమో మరి నిర్మాత శరత్‌మరార్‌కీ, దర్శకుడు డాలీకీ, హీరో పవన్‌కళ్యాణ్‌కీ మాత్రమే తెలియాలి.. అసలు మతలబేంటో.!