Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కథలో వేలుపెడితే సినిమా కట్?

కథలో వేలుపెడితే సినిమా కట్?

కొత్త డైరక్టర్లు అంటే చాలు చాలా మందికి కాస్త అలుసే. నిర్మాత, వాళ్ల ఫ్రెండ్స్, హీరో ఇలా ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవారే. కథను వాళ్లకు అనుకూలంగా మార్చేసేవారే. తొలిసినిమా అవకాశం కదా..తప్పదు అని పాపం, చాలా మంది కొత్త దర్శకులు తల వంచుతారు. కానీ ఫర్ ఏ ఛేంజ్, ఓ కొత్త దర్శకుడు అలా చేస్తే తనకు సినిమానే వద్దు అని వెళ్లిపోయినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఓ మాంచి పేరున్న పెద్ద డైరక్టర్ అసిస్టెంట్ ఒకరికి డైరక్షన్ చాన్స్ వచ్చింది. ఒకటో రెండో సినిమాలు చేసిన చిన్న హీరోతో సినిమా. ఓకె అయింది. కానీ ఇంతలో హీరో బంధుగణం రంగ ప్రవేశం చేసేసింది. కథ ఇలా మార్చాలి. అలా మార్చాలి. అంటూ రోజుకో సజెషన్. పైగా సినిమా నిర్మాణం కూడా వాళ్లదేనాయె. 

ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. తను పని చేసిన పెద్ద డైరక్టర్ విని ఓకె చేసిన స్క్రిప్ట్. తాను కష్టపడి తయారుచేసుకుని, బలంగా వుందని నమ్ముతున్న స్క్రిప్ట్. దాంతో వన్ ఫైన్ మార్నింగ్ తాను సినిమా చేయలేనని చెప్పి చక్కాపోయాడట. తన స్క్రిప్ట్ మీద, తన టాలెంట్ మీద ఎంత నమ్మకం లేకపోతే అలా చేయగలుగుతాడు. గొప్పోడే.

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?