Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కత్తెర పడ్డాక కాసులొస్తాయా.?

కత్తెర పడ్డాక కాసులొస్తాయా.?

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాకి కత్తెర పడింది. 'బ్రహ్మూెత్సవం' సినిమాకీ అంతే. తొలి రోజు టాక్‌ ఏంటి.? అన్నదానిపైనే దాదాపుగా ఇప్పుడు సినిమాల భవితవ్యం ఆధారపడి వుంటోంది. ఆ తర్వాత 'బాగానే వుంది..' అన్న టాక్‌ వచ్చినా ఉపయోగం వుండటంలేదు. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు.. ఇందులో ఏదీ మినహాయింపు కాదంతే. 

సినిమా విడుదలయ్యాక ట్రిమ్మింగ్‌ అనేది పరమ రొటీన్‌ వ్యవహారంగా మారిపోయింది. 'ఒక మనసు' సినిమా విషయంలోనూ నిర్మాత మధుర శ్రీధర్‌, ట్రిమ్మింగ్‌నే ఆశ్రయించారు. దాదాపు 15 నిమిషాలు ట్రిమ్మింగ్‌ చేసేశామని అంగీకరించారాయన. ట్రిమ్మింగ్‌ చేశాక, చూసినవారంతా చాలా బాగుందని చెబుతున్నారంటూ ముక్తాయింపునిచ్చారు మధుర శ్రీధర్‌. 

మెగా డాటర్‌ / మెగా హీరోయిన్‌.. ఇలా రకరకాల బిరుదులు సినిమా విడుదలకు ముందే సంపాదించుకున్న నిహారిక, తొలి సినిమా ఇది. దాంతో, ఓపెనింగ్స్‌ ఓ మోస్తరుగానే లభించాయి. చిన్న సినిమానే కదా, టాక్‌ ఎలా వున్నా, ఎలాగోలా గట్టెక్కేస్తుందన్న టాక్‌ ఇండస్ట్రీలో విన్పించింది సినిమా రిలీజ్‌కి ముందు. అయితే, మరీ టీవీ సీరియల్‌లా వుందన్న టాక్‌తో, 'ఒక మనసు'ని దూరం పెట్టేశారు. టార్గెట్‌ ఆడియన్స్‌ అయిన యూత్‌ కూడా 'ఒక మనసు'కి దూరంగానే వున్నారు. 

'ఒక మనసు' విషయంలోనే కాదు, ఏ సినిమా అయినా ట్రిమ్మింగ్‌ అయ్యిందంటే, ఇక ఆ సినిమా సంగతి అంతే. ట్రిమ్మింగ్‌ చేశాం.. అని చెప్పుకోవడం ద్వారా, ఫెయిల్యూర్‌ని ఒప్పేసుకున్నట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?