డిక్టేటర్ సినిమాను చూసేందుకు తెలంగాణ మఖ్యమంత్రి కేసిఆర్ ను స్వయంగా ఆహ్వానించారు హీరో బాలకృష్ణ. మరి ఆయన ఎప్పుడు చూస్తారో? ఆ సంగతి అలా వుంచితే సినిమా విడుదలకుముందే బాలయ్య బాబు ఫ్యామిలీ అంతా కలిసి డిక్టేటర్ చూసారు. కానీ ఒక్క చంద్రబాబు మాత్రం మిస్సయ్యారు. కారణం..ఆయన విజయవాడలో ముఖ్యమంత్రి పని వత్తిడిలో వుండడం. పండుగ సెలవులోచ్చాయి..అంతా నారావారిపల్లెకు వెళ్లారు..ఉల్లాసంగా గడిపివచ్చారు.
మరి ఈ గ్యాప్ లో ఎక్కడా డిక్టేటర్ సినిమా చూసినట్లు వార్తలు అందలేదు. మరి బాలయ్య బాబు చెప్పలేదో..బాబుగారికి బావమరిది సినిమా చూసేందుకు తీరుబాటు కుదరలేదో? కానీ ఆయనకు నచ్చే ఓ పాయింట్ వున్న సినిమా మిస్సయ్యారు. బాబుకు, ఆయన పార్టీకి సరిపడని సోనియా, ఆమె అల్లుడు వార్దాలను పోలిన పాత్రలు డిక్టేటర్ లో వున్నాయి. వాటిని చూసి బాబు ఎంజాయ్ చేసేవారు కదా.