కేశవ సినిమా విడుదల మరో నాలుగు రోజుల్లోకి వచ్చేసింది. ఇంత వరకు సెన్సారు లేదు. ఈ రోజు సెన్సారు చేయించాలని కిందా మీదా అవుతున్నారు. మరోపక్క రీరికార్డింగ్, డీటీఎస్ లో ఏదో సమస్య అని వినికిడి. ఈ విషయమై దర్శకుడు సుధీర్ వర్మ వెళ్లి చెన్నయ్ లో కూర్చున్నారు. అది సెటిల్ కావాల్సి వుంది.
సెన్సారుకు రఫ్ కాపీ చూపించేసి, సర్టిఫికెట్ తెచ్చుకున్నా, అన్నీఫైనల్ అయ్యి, క్యూబ్ లకు అప్ లోడ్ చేయడం, అమెరికాకు కీలు పంపడం వంటి కార్యక్రమాలు వుండనే వుంటాయి. అమెరికాలో నిఖిల్ ఇంతకు ముందు సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా మంచి కలెక్షన్లు నమోదు చేసింది. ఆ భరోసాతో ఈ సారి ఓవర్ సీస్ లో ఈ సినిమా కోసం భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 120 స్క్రీన్ల వరకు సెట్ చేసుకుంటున్నారు. పైగా ఓవర్ సీస్ మార్కెట్ కోసం హీరో నిఖిల్ ఈ మధ్య అక్కడ ఓ పాట విడుదల అంటూ కాస్త హడావుడి కూడా చేసారు.
కానీ ఇక్కడ చూస్తుంటే పరిస్థితి అవుతందా? అవ్వదా అన్నట్లు గా వుంది. ప్రొడక్షన్ మొత్తం దర్శకుడు సుధీర్ వర్మదే కాంట్రాక్ట్. ఆయనే ఫస్ట్ కాపీ తీసి ఇవ్వాల్సి వుంది. అందుకే ఆయనే అటు ఇటు పరుగులు పెడుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి కాకపోతే, ఓవర్ సీస్ విడుదల డవుట్ లో పడుతుందని తెలుస్తోంది.