Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కేశవపై ఏసియన్ బిగ్ బెట్

కేశవపై ఏసియన్ బిగ్ బెట్

నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్ పై అంచనాలు కాస్త భాగానే వున్నాయి. స్వామిరారా కాంబినేషన్ కావడం, ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్ కావడంతో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. పైగా ఇటీవల కేశవ ఫస్ట్ లుక్ కాస్త ఇంట్రెస్ట్ ను కలుగచేసింది. రివెంజ్ ఫార్ములాతో కోస్టల్ రోడ్ మూవీగా తయారవుతున్నఈ సినిమా నైజాం హక్కులను ఏసియన్ సినిమాస్ సంస్థ కాస్త ఫ్యాన్సీ రేటుకు తీసుకుంది. 

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా నైజాంలో దగ్గర దగ్గర అయిదు కోట్ల షేర్ సాధించింది. దీంతో ఇప్పుడు ఏసియన్ సంస్థ నాలుగు కోట్లకు కాస్త అటుగానే కేశవ నైజాం హక్కులను తీసుకుంది. వాస్తవానికి ఆంధ్ర, నైజాం టోటల్ థియేటర్ రైట్స్ ను ఏసియన్ సంస్థ అడిగింది కానీ, నిర్మాణ సంస్థ అయిన అభిషేక్ పిక్చర్స్ కమిట్ కాకుండా నైజాం మాత్రమే ఇచ్చింది.

ఇఫ్పుడు ఈ రేషియాలో ఆంధ్ర, సీడెడ్ రేట్లు ఎలా వుంటాయో? ఇప్పటి వరకు నిఖిల్ సినిమా హయ్యస్ట్ థియేటర్ రైట్స్ పది నుంచి పన్నెండు కోట్లు మాత్రమే. ఇప్పుడు కేశవ కొత్త రికార్డు అవుతుంది. అభిషేక్ పిక్చర్స్ సంస్త నిర్మిస్తున్న కేశవ సినిమాలో పెళ్లి చూపులు హీరోయిన్ నిఖిల్ సరసన నటిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?