మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా 'ఖైదీ-150' వందకోట్ల మార్కు(డిస్ట్రిబ్యూటర్స్ షేర్)ను సమీపిస్తోంది. 16వ రోజుకు ఈ సినిమా 95.65 కోట్ల రూపాయలను వసూళు చేసినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వంద కోట్లకు మరో అడుగు దూరంలో ఉంది ఈ సినిమా. ఆంధ్రా, సీడెడ్, యూఎస్‌లో ఈ సినిమా లాభాల పంట పండించింది. నైజాంలో మాత్రం కొంత వెనుకబడింది. ఈ నంబర్లు డిస్ట్రిబ్యూటర్స్ షేర్స్ ప్రాంతాల వారీగా వీటి వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం – 18.50 కోట్లు
సీడెడ్ -14.05 కోట్లు
ఉత్తరాంధ్ర- 11.98 కోట్లు
గుంటూరు-6.8 కోట్లు
కృష్ణా-5.32 కోట్లు
ఈస్ట్ -7.65 కోట్లు
వెస్ట్ – 5.70 కోట్లు
నెల్లూరు -3.15 కోట్లు
కర్ణాటక-8.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.5 కోట్లు
ఓవర్సీస్ -12.5 కోట్లు
మొత్తం-95.65 కోట్లు