ఈ సారి సంక్రాంతి బరిలో ఇటు మెగాస్టార్, అటు నందమూరి యువరత్న ఢీకొనడం అన్నది ఎప్పుడో పక్కా అయిపోయింది. అయితే ఇప్పుడు డేట్ విషయంలో కూడా ఢీ అంటే ఢీ అనే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి బాలయ్య శాతకర్ణి జనవరి 12 అని ముందే ప్రకటించారు.
ఆ తరవాత ఖైదీ నెంబర్ 150 తేదీని 13 అంటూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచన మార్చుకుని ఖైదీ సినిమాను రెండు రోజులు ముందుగా 11న తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. ఇదే శాతకర్ణి బాలయ్యకు కాస్త కోపం తెప్పిస్తున్నట్లు వినికిడి.
అలా అయితే శాతకర్ణి ని కూడా 11న విడుదల చేయమని ఆయన నిర్మాతకు హుకుం జారీ చేసారట. ఖైదీ నెంబర్ 150 ముందుగా అనుకున్న ప్రకారం 13న వస్తే సరేసరి. శాతకర్ణి 12న వస్తుంది. లేదూ ఖైదీ 11 కు వెళ్తే శాతకర్ణి కూడా 11నే వస్తుందట. మొత్తానికి విడుదల డేట్ విషయంలో కాస్త గట్టి పంతాలే నెలకొనేటట్లు వుంది పరిస్థితి.