చానెళ్లు, సినిమాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి వుంటాయి. వీళ్లు ప్రకటనలు ఇవ్వాలి..వాళ్లు వీళ్ల వార్తలు, ఇంటర్వూలు ప్రసారం చేయాలి. ఇది కాకుండా పరోక్షంగా మేనేజ్ చేసే వ్యవహారాలు కొన్ని వుంటాయి. ఓ సినిమా వచ్చింది అనుకోండి. ఇంక చానెళ్లలో ఆ సినిమా తాలూకా హీరో, లేదా డైరక్టర్ లేదా బ్యానర్ సినిమాలు టీవీల్లో కనిపించడం ప్రారంభమవుతుంది. అంటే చూసేవాళ్లు గుర్తుచేసుకుని, మళ్లీ ఆ హీరో,లేదా డైరక్టర్ సినిమా వచ్చిందని థియేటర్ కు పరుగు పెట్టాలి. ఇది ప్రతి పెద్ద హీరో సినిమాలకు జరిగేదే. దీని వెనుక ఏం మొహమాటాలు వుంటాయన్నది వారికే తెలియాలి.
ఇప్పుడు ఈ వ్యవహారంలో మెగాస్టార్ టీమ్ మేనేజ్ మెంట్ ఓ రేంజ్ లో నడుస్తోంది. ఖైదీ నెం 150 సినిమా విడుదలైంది మొదలు టీవీల్లో చిరంజీవి సినిమా రాని రోజు లేదు. ఈ విషయంలో జీ టీవీ అందరికన్నా ముందుంది. ఆ పై మెగాస్టార్ ఫ్రభావం వున్న మా టీవీ సంగతి చెప్పనక్కరలేదు. ఇక జెమిని టీవీ కూడా ఇదే బాట పట్టింది. ప్రతి చానెల్ లోనూ ఇండస్ట్రీతో లింక్ వున్న జనాలు కీలక స్థానాల్లో వుండడంతో ఈ విధమైన మెగా మ్యానేజ్ మెంట్ సులువు అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పండగ నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక చానెల్ లో ఏదో ఒక టైమ్ లో చిరంజీవి సినిమా వచ్చి తీరాల్సిందే అన్నట్లు వుంది పరిస్థితి.
ఇలా ఇంకా ఎన్నాళ్లు మెగా చిత్రోత్సవం జరుపుతాయో ఈ చానెళ్లు. ఎవరు అన్నది మీడియాను చంద్రబాబు వర్గమే మేనేజ్ చేయగలరని చెప్పింది. సినిమాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం బాబు వర్గం పక్కకు తప్పుకుని మెగా వర్గానికి దారివ్వాల్సిందే. కావాలంటే చూడండి సంక్రాంతి తరువాత బాలయ్య సినిమాలు ఏమన్నా పెద్దగా కనిపించాయేమో ఇదే చానెళ్లలో? ఈ మేనేజ్ మెంట్ బాలయ్య టీమ్ కు చేతకాలేకపోయింది పాపం.