చిరంజీవి-కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో ఒక టైమ్ లో బ్లాక్ బస్టర్లే. అసలు చిరంజీవికి ఖైదీ అనే సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరక్టర్ కోదండరామిరెడ్డినే. అలాంటి కోదండ రామి రెడ్డికి మెగాస్టార్ 150 వ సినిమా ప్రీ సక్సెస్ మీట్ కు ఆహ్వానం లేదట. ఆ మధ్య చిరంజీవిపై కోదండరామ్ రెడ్డి కొన్ని కామెంట్ లు చేయడం, ఆపై మళ్లీ సారీ చెప్పడం లాంటివి జరిగిన సంగతి తెలిసిందే.
పైగా ఇటీవల అదే కోదండరామి రెడి తిరుపతిలో జరిగిన బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా అడియో ఫంక్షన్ కు హాజరై ప్రసంగించారు కూడా. వన్ ప్లస్ వన్ అంటే టూ అయినట్లుగా, అవీ ఇవీ అన్నీ కలిసి, కోదండరామ్ రెడ్డికి ఖైదీ 150 ఫంక్షన్ కు ఆహ్వానం అందకుండా చేసి వుంటాయని, ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆహ్వానం అంది వుంటే ఇలాంటి ఫంక్షన్ ను కోదండరామ్ రెడ్డి మిస్ కారు కదా? పైగా శాతకర్ణికి వెళ్లి, దీనికి వెళ్లడం అస్సలు మానరు కదా? సో, ఆహ్వానం అందలేదన్నే వాస్తవం అనుకోక తప్పదు. చిత్రమేమిటంటే, గతంలో ఎన్నో సార్లు రామ్ చరణ్ ను బహిరంగంగా విమర్శించిన , అలాగే చిరంజీవికి వ్యతిరేకి అయిన దర్శకుడు దాసరి నారాయణ రావుకు మాత్రం ఫంక్షన్ లో పెద్ద పీట దక్కింది. అదేం చిత్రమో?